RS Praveen kumar :దళిత బంధు, 1000 కోట్లతో 20వేల డిజిటల్ స్కూళ్లు...

RS Praveen kumar ,trs, Dalit bhandu, trs, telangana, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దళిత బంధు, తెలంగాణ, హుజూరాబాద్,

RS Praveen kumar : రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి ప్రభుత్వానికి చురకలు అంటించారు... రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పేరుతో ఖర్చు వెయ్యి కోట్ల రూపాయలతో ఏవరికి గుణపాఠం నేర్పాలని ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఆ డబ్బులతో 20 వేల డిజిటల్ స్కూళ్లను ఏర్పాటు చేయవచ్చని అన్నారు..

 • Share this:
  పదవి విరమణ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న దళిత బంధుపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే... దళిత బంధు ద్వారా వారి జీవితాలు బాగుపడవని ఆయన చెబుతున్నారు. దళితుల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలంటే విద్యా వ్యవస్థపై డబ్బులు ఖర్చు పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

  ముఖ్యంగా ఆగస్టు ఎనిమిదిన బీఎస్పీలో చేరబోతున్న ప్రవీణ్ కుమార్ అందకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు.. ఈ క్రమంలోనే తెలంగాణలో బహుజన స్థాపన ఎవరు ఆపలేరని అన్నారు. రాష్ట్రంలో విరివిగా తిరుగుతూ రోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గోంటున్నారు.

  మరోవైపు హుజూరాబాద్‌లో దళిత బంధును ఎందుకు తీసుకువస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దీనిపై లోతుగా చర్చించకుండా కేవలం రాజకీల లబ్ధికోసమే దళిత బంధును తీసుకువస్తున్నారని ఆయన విమర్శించారు...

  ఇక దళిత బంధు ద్వారా హుజూరాబాద్‌లో ఖర్చు పెడుతున్న వెయ్యి కోట్ల ద్వారా సుమారు 20 వేల డిజిటల్ స్కూళ్లను ఏర్పాటు చేయవచ్చని అన్నారు. మరోవైపు పేద విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు, ఫోన్లు కొనిపెట్టడమే కాకుండా అద్భుతమైన హాస్టళ్లను నిర్మించవచ్చని సూచించారు.

  ఇక తనను కలిసిన ఉద్యోగులను సస్పెండ్ చేశారని, మరి తనను గుండెళ్లో పెట్టుకున్న లక్షలాది మందిని ఏం చేస్తారని ఆయన ఘాటుగా స్పందించారు.బహుజనులు అభివృద్ది రంగంలోకి రాకుండా పాలుకులు కుట్రలు పన్నుతున్నారని ఆయన అన్నారు. బహుజన అధికారం ఆలోచన వచ్చిన తర్వాత ఆపడం ఎవ్వరి తరం కాదని చెప్పారు.
  Published by:yveerash yveerash
  First published: