CM KCR : దళిత బంధుపై రూటు మార్చిన సీఎం కేసీఆర్..అక్కడ కాకుండా ఇక్కడే ఎందుకు...?

వాసాలమర్రిలో సీఎం కేసీఆర్

CM KCR : నిన్నటి వరకు దళిత బంధును హుజూరాబాద్ లో ప్రారంభిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ తన స్ట్రాటజీని మార్చారా..? నేడు దళిత బంధును వాసాల మర్రిలో అమలు చేసేందుకు ఏకంగా డబ్బులు కూడా విడుదల చేయడం వెనక మతలబేమిటి..పతిపక్షాల వ్యుహాలకు చెక్ పెడుతున్నారా లేక వారి డిమాండ్‌కు తలొగ్గుతున్నారా..?

 • Share this:
  సీఎం కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు రోజుకో రకంగా మారుస్తూ..రాజకీయ పార్టీలకు అందని అంచనాల్లో మునిగి తేలుతున్నారు... ముఖ్యంగా ఈటల రాజేందర్‌ను పార్టీ నుండి బయటకు పంపించే నుండి నేటి వరకు ఆయన చుట్టూనే రాజకీయం తిరుగుతు ఉంది.. ఈటలే స్వతహాగా రాజీనామా చేసేలా వ్యవహరించం నుండి హుజూరాబాద్‌లో పాగా వేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యర్థులను కొంత డోలాయమానంలో పడేస్తున్నాయి.. తాను ఒకటి... చెబుతూనే మరో ఆయుధానికి పదును పెడుతున్నారు..ఇలా చాలా కాలంగా హుజూరాబాద్ వేదికగా అనేక రాజకీయ వ్యూహాలకు సీఎం కేసీఆర్ పదును పెడుతున్నారు.

  ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్ నియోజకవర్గంలో అధిక జనాబా ఉన్న దళిత ఓట్లను రాబట్టేందుకు దళిత బంధును తీసుకువచ్చారు.ఇందుకు అనుగుణంగానే అధికారికంగా అడుగులు వేశారు.. దళితులను ప్రగతిభవన్‌కు పిలిపించి..ఈ పథకం గురించిన వివరాలు వెళ్లడించారు.. అందుకోసం ఒక్క హుజూరాబాద్‌లోనే రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. 500 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించేందుకు ఆగస్ట్ 16న ముహుర్తం ఫిక్స్ చేశారు. ఎవరెన్ని విమర్శించినా తమది రాజకీయ పార్టీనే అంటూ దళిత బంధు ఓట్ల కొసమే అన్నట్టుగా సీఎం తన వ్యుహాలకు పదుతను పెడుతున్నారు..

  అయితే ఉప ఎన్నికల నేపథ్యంలోనే దళిత బంధును తీసుకువస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే స్కీంను వ్యతిరేకించకుండా..నే ప్రతిపక్షాలు తమ స్ట్రాటజీని మార్చాయి.. పథకాన్ని ఆహ్వానిస్తూనే.. ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టేందుకు ప్లాన్ చేశాయి..దళిత బంధును కేవలం హుజూరాబాద్‌ నియోజవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇదే వ్యుహాలతో సీఎం కేసీఆర్ ఆలోచనలకు బ్రేకులు వేస్తున్నారు..

  సాధారణంగా ప్రతిపక్షాల విమర్శలకు ఏమాత్రం విలువ ఇవ్వని సీఎం కేసీఆర్ తాను అనుకున్నట్టుగానే ముందుకు సాగేందుకే మొగ్గుచూపుతారు... ..అయితే ఉన్నట్టుండి దళిత బంధు అమలులో సీఎం కేసీఆర్ స్ట్రాటజీ మార్చారు... హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామని చెప్పిన ఆయన ఒక్కసారిగా వాసాలమర్రిలో ప్రత్యక్షమయి.. అక్కడి దళితులకు కూడా దళిత బంధును అమలు చేస్తామని చెప్పారు.. అందుకోసం లబ్ధిదారుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తి చేశారు..వారి ఖాతాల్లోకి రేపే డబ్బులు పడతాయని చెప్పారు..అయితే ఆ డబ్బులతో ఏం చేస్తారనే దానిపై మరోవారం రోజుల్లో వచ్చి నిర్ణయం తీసుకుంటామని అన్నారు...మరోవైపు ఆ గ్రామంలో మిగులు భూమిని కూగా దళితులకు పంచుతామని హామిని ఇచ్చారు..

  దీంతో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల విమర్శలకు దిగివస్తున్నారా అనే సంకేతాలు వస్తున్నాయి..కేవలం హుజూరాబాద్‌లో పథకాన్ని ప్రారంభించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఎదుర్కొవడంతో పాటు స్వంత పార్టీల నేతల నుండి ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి.. దీంతో ముందుగా తన దత్తత గ్రామంలో అమలు చేసి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రతి నియోజకవర్గానికి కొంతమంది లబ్ధిదారులను ఎంపికచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మరోవైపు దళితులకు మూడేకరాల భూ పంపిణి కూడా ఆయా వర్గాల నుండి సీఎం కేసీఆర్ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.. అందుకే భూ పంపిణి కార్యక్రమాన్ని కూడా వాసాల మర్రిలో ప్రారంభించి ప్రతిపక్షాల నోళ్లను మూయించే ప్రక్రియకు సీఎం శ్రీకారం చూడుతున్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు.
  Published by:yveerash yveerash
  First published: