Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...

Daily Horoscope : గ్రహాల కదలికలు, రాసులను బట్టీ ఈ రోజు ఎవరి అదృష్టం ఎలా ఉందో విజయవాడకు చెందిన ప్రముఖ జ్యోతిష్కులు రాళ్ళపల్లి వెంకటేశ్వర శర్మ (srivatcha@gmail.com) గారి ద్వారా తెలుసుకోండి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 23, 2019, 5:18 AM IST
Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...
రాశి ఫలాలు - మీ రాశి ఫలాలు తెలుసుకోండి.
  • Share this:
తేది:23-8-2019
మేషరాశి వారు ఈరోజు సంతానం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. వాటి వల్ల మానసిక ఒత్తిళ్ళు కలుగవచ్చు. శత్రువుల పట్ల జాగ్రత్త వహించడం మంచిది.

వృషభరాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. సోదరీ, సోదర వర్గం వలన చిన్నపాటి సమస్యలు రావచ్చు. విద్యార్థులకి సామాన్యంగా ఉంటుంది.

మిధునరాశి వారికి ఈరోజు ఆకస్మిక దూరప్రయాణాలు కలుగవచ్చు. అవి లాభసాటిగా వుంటాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలగవచ్చు.

కర్కాటకరాశి వారికి ఈరోజు ఆర్థికపరంగా చిన్నపాటి చిక్కులు కలగవచ్చు. సోదరుల వలన ఆర్థికపరమైన చిక్కులు రావచ్చు. విద్యార్థులు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిరావచ్చు.

సింహరాశి వారు ఈరోజు మిత్రులవలన భంగపాటు, ధనపరంగా చిన్నపాటి చిక్కులు కలుగవచ్చు. ఉన్నత వ్యక్తుల పరిచయం... తద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది.

కన్యారాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటుంది. సోదరుల వలన శుభవార్తలు వింటారు. సంతానపరంగా శుభదాయకంగా ఉంటుంది. శ్రమ కలగవచ్చు.తులారాశి వారికి ఈరోజు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. ఎదుటివారిని నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొద్దిపాటి భయాందోళనలు కలుగవచ్చు.

వృశ్చికరాశి వారికి ఈరోజు కుటుంబపరంగా సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సంతానపరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

ధనస్సురాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు కొద్దిపాటి ఆకస్మిక ధనలాభం కలుగవచ్చు. సత్కార్యాలలో పాలుపంచుకుంటారు. ప్రయాణాలవలన ధనలాభం కలుగవచ్చు.

మకరరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. శత్రువుల వలన మనస్తాపం కలుగవచ్చు. కుటుంబపరంగా కొద్దిపాటి చిక్కులు కలుగవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు, శారీరక శ్రమ కలుగవచ్చు.

కుంభరాశి వారికి ఈరోజు శారీరక శ్రమ మరియు భయాందోళన కలగవచ్చు. ఉద్యోగాలు లాభదాయకంగా ఉన్నా సంతృప్తికరంగా ఉండవు. ఆర్ధికపరమైన ఇబ్బందులు రావచ్చు.

మీనరాశి వారు ఈరోజు అనవసరమైన ఆలోచనలు చేస్తారు. దానివల్ల మానసిక ఒత్తిడి కలుగవచ్చు. అనుకున్న కార్యాలలో చిన్నపాటి అవరోధాలు ఎదురై, వాటివల్ల చికాకులు కలుగవచ్చు.
Published by: Krishna Kumar N
First published: August 23, 2019, 5:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading