Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...

Daily Horoscope : గ్రహాల కదలికలు, రాసులను బట్టీ ఈ రోజు ఎవరి అదృష్టం ఎలా ఉందో విజయవాడకు చెందిన ప్రముఖ జ్యోతిష్కులు రాళ్ళపల్లి వెంకటేశ్వర శర్మ (srivatcha@gmail.com) గారి ద్వారా తెలుసుకోండి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 22, 2019, 5:11 AM IST
Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...
రాశి ఫలాలు - మీ రాశి ఫలాలు తెలుసుకోండి.
  • Share this:
తేది: 22-8-2019
మేషరాశి వారికి ఈరోజు శారీరక మానసిక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండును. చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు కలుగవచ్చు. మనస్సు స్థిరత్వం తగ్గవచ్చు.

వృషభరాశి వారు ఈరోజు ధన విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అనవనరమైన ఖర్చులు, అవసరం లేని రుణాలు ఆలోచన చేసే అవకాశం కలదు. శారీరక, మానసిక ఒత్తిళ్ళు కలిగే అవకాశం కలదు.

మిధునరాశి వారు ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సమయాలలో వాటి వల్ల ఇబ్బందులు కలుగవచ్చు. దూరప్రయాణాలు చేసే అవకాశం కలదు. కుటుంబంలో చికాకులు కలుగవచ్చు.

కర్కాటకరాశి వారికి ఈరోజు సంతానపరంగా సామాన్యంగా ఉంటుంది. ధనపరమైన చిక్కులు రావచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు బుద్ధి మందగించే అవకాశం కలదు.

సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు, ధనవ్యయం అధికంగా ఉండవచ్చు. వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. సోదరుల వల్ల కొద్దిపాటి లాభం కలుగవచ్చు.

కన్యారాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు స్వల్ప ధనలాభాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.తులారాశి వారికి ఈరోజు ఆర్థికపరంగా ఎక్కువ జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైన రుణాలు చేయడం మంచిదికాదు. వాటివల్ల ఒత్తిళ్ళకు లోనవుతారు.

వృశ్చికరాశి వారు ఈరోజు సత్కార్యాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు చిన్నపాటి చిక్కులు కలుగవచ్చు. వాటిని నిరోధించే ఆలోచనలు చేస్తారు.

ధనస్సురాశి వారు ఈరోజు ధన విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. శతృపరంగా ధననష్టం కలిగే అవకాశం కలదు. కుటుంబపరంగా చికాకులు కలుగవచ్చు. స్వల్ప ధనలాభం కలుగవచ్చు.

మకరరాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులు లాభదాయకంగా ఉన్న ఖర్చులు అవసరమైనవి కలుగుతాయి. మానసిక చికాకులు కలుగవచ్చు. సోదరుల వల్ల ఇబ్బందులు, ఆకస్మిక ప్రయాణాలు కలుగవచ్చు.

కుంభరాశి వారికి ఈరోజు ఉద్యోగ, వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభదాయకంగా ఉంటుంది. మిత్రుల వలన సమస్యలు తలెత్తవచ్చు. కొద్దిపాటి భయాందోళన కలుగవచ్చు.

మీనరాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు, తద్వారా లాభం కలిగే అవకాశం కలదు. సత్కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో శారీరక, మానసిక శ్రమ కలిగే అవకాశాలు కలవు.
First published: August 22, 2019, 5:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading