Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...

Daily Horoscope : గ్రహాల కదలికలు, రాసులను బట్టీ ఈ రోజు ఎవరి అదృష్టం ఎలా ఉందో విజయవాడకు చెందిన ప్రముఖ జ్యోతిష్కులు రాళ్ళపల్లి వెంకటేశ్వర శర్మ (srivatcha@gmail.com) గారి ద్వారా తెలుసుకోండి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 21, 2019, 5:04 AM IST
Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...
రాశి ఫలాలు - మీ రాశి ఫలాలు తెలుసుకోండి.
Krishna Kumar N | news18-telugu
Updated: August 21, 2019, 5:04 AM IST
తేది: 21-8-2019
మేషరాశి వారు ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు, సత్కార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల వలన లాభం కలుగవచ్చు. ఎదుటివారిని నమ్మే విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.

వృషభరాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సత్కార్యాల్లో పాల్గొంటారు. మంచి పేరు గడిస్తారు.

మిధునరాశి వారికి ఈరోజు మానసిక శ్రమ, శారీరక శ్రమ అధికంగా ఉండి లాభదాయకంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చుల వలన మానసిక ఒత్తిళ్లకు లోనయ్యే పరిస్థితి కలుగుతుంది.



కర్కాటకరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకంగా ఉన్నా సంతృప్తికరంగా ఉండవు. సోదరపరంగా ఆర్థిక ఇబ్బందులు కలుగవచ్చు.

సింహరాశి వారికి ఈరోజు కొద్దిపాటి భయాందోళనలు కలుగవచ్చు. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం కలదు.

కన్యారాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. సహ ఉద్యోగ, వ్యాపారస్తులతో జాగ్రత్త వహించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శ్రమ కలుగవచ్చు.
Loading...
తులారాశి వారికి ఈరోజు సంతానపరమైన విషయాలు ఆనందదాయకంగా ఉంటాయి. సంతాన ఆరోగ్యపరమైన సమస్యలు స్వల్పంగా ఉంటాయి. శుభవార్తలు వినే అవకాశం కలదు.

వృశ్చికరాశి వారికి ఈరోజు మానసిక చింతన, కుటుంబపరమైన చికాకులు కలుగవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా వున్నా శారీరక, మానసిక శ్రమ, ఒత్తిళ్ళు కలుగవచ్చు.

ధనస్సురాశి వారికి ఈరోజు కుటుంబపరంగా సామాన్యంగా ఉంటుంది. కొద్దిపాటి చిక్కులు కలిగినా వాటిని అధిగమిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి సంప్రాప్తించవచ్చు. శత్రుబాధలు కలుగవచ్చు.

మకరరాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటుంది. సంతానపరంగా కుటుంబపరంగా సామాన్యంగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు చేసే అవకాశం కలదు.

కుంభరాశి వారికి ఈరోజు సాహసోపేత నిర్ణయాలు తీసుకునే అవకాశం కలదు. ఆకస్మిక ప్రయాణాల వలన లాభాలు కలుగుతాయి. అనుకున్న కార్యాలు నెరవేరుస్తారు.

మీనరాశి వారికి ఈరోజు ఆకస్మిక దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. తద్వారా లాభం కలిగే అవకాశం కలదు. విద్యార్థులు కొత్త ఆలోచన చేసే అవకాశం కలదు. పేరును పొందుతారు.
First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...