Dr Nageshwar Reddy: ఏఐజీ చైర్మన్‌ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి విశిష్ట పురస్కారం.. ASGE అత్యున్నత అవార్డు అందుకున్న తొలి భారతీయ డాక్టర్‌గా గుర్తింపు..

ఏఐజీ చైర్మన్‌ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి విశిష్ట పురస్కారం..

ఏఐజీ చైర్మన్‌ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి విశిష్ట గౌరవం దక్కింది. ప్రముఖ ఎండోస్కోపి సంస్థ ASGE అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ డాక్టర్‌గా నిలిచారు.

  • Share this:
    జీఐ ఎండోస్కోపి విభాగంలో ప్రపంచంలో అత్యున్నత సంస్థలలో ఒకటైన ది అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపి తమ వార్షిక క్రిస్టల్ అవార్డులను ప్రకటించింది. నిన్న రాత్రి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ అవార్డులలో ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపిగా పరిగణించబడే Dr. Schindler పేరుతో ప్రధానం చేసే Rudolf V. Schindler అవార్డును అత్యున్నతమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది ఆ అవార్డును ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి (Dr. D Nageshwar Reddy) సొంతం చేసుకున్నారు. భారతదేశం నుంచి ఈ అవార్డు సొంతం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నిలిచారు.

    ఈ అవార్డును ASGE ప్రెసిడెంట్ డాక్టర్ క్లాస్ మెర్జెనర్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి వర్చువల్‌ విధానంలో ప్రధానం చేశారు. ఈ సందర్భంగా క్లాస్ మెర్జెనర్ మాట్లాడుతూ.. ఎండోస్కోపిక్ పరిశోధన, బోధన లేదా Dr. Schindler ప్రమాణాల బాటలో జీఐ ఎండోస్కోపి రంగానికి సేవలు చేసినవారికి ASGE అత్యున్నత పురస్కారాన్ని అందించడం జరుగుతుందన్నారు. డాక్డర్ రెడ్డి ఇండియాలోనే ఎండోస్కోపిని ప్రోత్సహించినవారిలో మొట్టమొదటి వ్యక్తి అని తెలిపారు. ప్రపంచంలోని చాలా మంది ఎండోస్కోపిస్ట్‌లకు మెలుకువలు అందించారని కొనియాడారు.

    ఈ సందర్భంగా డాక్టర్ డి నాగేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘ASGE యొక్క అంతర్జాతీయ సభ్యుడిగా నాకు ASGE యొక్క రుడాల్ఫ్ వి. షిండ్లర్ అవార్డును అందుకోవడం వినయంగా ఉంది. మనం ఎక్కడ పనిచేస్తున్నామనే దానికన్నా.. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, అంకితభావంతో పనిచేస్తున్నామనే అంశాన్ని సమాజం గుర్తిస్తోంది. ప్రంచంలోని ఎండోస్కోపిస్టులకు మాత్రమే కాకుండా అభివృద్ది చెందుతున్న ఎండోస్కోపిస్టులకు కూడా ఇది ఒక నిదర్శనం. ఈ గౌరవంతో.. క్వాలిటీతో కూడిన ఎండోస్కోపి విద్యను, ప్రమోషన్‌ కోసం నన్ను అంకితం చేసుకుంటున్నాను. ఎండోస్కోపి రంగానికి నేను అందించి సహకారం, నా విజయాలు.. నా భార్య, నా కుంటుంబం సాకారం లేకుంటే సాధ్యమయ్యేవి కాదు. ఏఐజీ హాస్పిటల్స్‌లోని నా సహచరులకు, సిబ్బందికి నేను రుణపడి ఉంటాను. ఎండోస్కోపి విద్యను, పరిశోధనలు ప్రోత్సహించడంలో నా విజన్‌కు మద్దతుగా నిలిచినందుకు భారతదేశంలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో ఉన్న నా సహచరులు, సిబ్బందికి నా కృతజ్ఞతలు’అని తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: