• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • CYCLONE NIVAR CLOUDY WEATHER AND RAIN IN WARANGAL AND SEVERAL TELANGANA DISTRICTS SU

Cyclone Nivar: వరంగల్‌పై నివర్ తుపాన్ ఎఫెక్ట్.. ఆందోళనలో రైతులు

Cyclone Nivar:  వరంగల్‌పై నివర్ తుపాన్ ఎఫెక్ట్.. ఆందోళనలో రైతులు

ప్రతీకాత్మకచిత్రం

నివర్ తుపాన్ ప్రభావం తెలంగాణలోని వరంగల్‌పై కూడా పడింది. జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

  • Share this:
    నివర్ తుపాన్ తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని పలు జిల్లాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. నివర్ తుపాన్ ప్రభావం ఆ ప్రాంతాల్లోనే కాకుండా తెలంగాణలోని వరంగల్‌పై కూడా పడింది. జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వాతావరణం చల్లబడింది. జిల్లాలోని పలుచోట్ల గురువారం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే వాతావరణం చల్లబడటం, ఆకాశం మేఘావృతం అయి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాలు కోతకు రావడం, పలుచోట్ల ఐకేపీ సెంటర్లలో, కల్లాల్లో దాన్యం నిల్వ ఉండటంతో.. రైతులకు కంటిమీద కునుకు ఉండటం లేదు. ఒకవేళ వర్షాలు పడితే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటను కాపాడుకోవాలంటే వర్షం పడకుడదని కోరుకుంటున్నారు. మరోవైపు వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

    వరంగల్‌లో మాత్రమే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా వాతావరణం బాగా చల్లబడింది. రాష్ట్రంలోని పలుచోట్ల గురువారం రాత్రి వర్షం కురిసింది. ఇక, దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఈ నెల 29న మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

    ఇక, గురువారం తెల్లవారుజామున తీరం దాటిన నివర్ తుపాన్ క్రమంగా బలహీన పడుతుంది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపాన్ నుంచి తీవ్ర తుపాన్‌గా మారింది. అది మరికాస్త బలహీనపడి వాయుగుండంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ వాయుగుండం తిరుపతి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లోని పలు చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: