హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cyberabad Police: రజనీకాంత్ స్టైల్‌లో అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన సైబరాబాద్ పోలీసులు..

Cyberabad Police: రజనీకాంత్ స్టైల్‌లో అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన సైబరాబాద్ పోలీసులు..

(image-Twitter)

(image-Twitter)

నిబంధనలు పాటించకుండా రోడ్ల మీదకు వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు.

నిబంధనలు పాటించకుండా రోడ్ల మీదకు వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు సంబంధించిన ఫొటోలను తీసి చలాన్లు పంపిస్తున్నారు. మరోవైపు వాహనదారులకు నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్డుపైకి వచ్చినప్పుడు పాటించాల్సిన రూల్స్ గురించి వాహనదారులకు ఎడ్యుకేట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ చాలా మంది పోలీసుల మాటలను పట్టించుకోవడం లేదు. కొందరైతే నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా.. తమకు జరిమానా విధించకుండా చూసుకుంటున్నారు. వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా కొందరు, నెంబర్ ప్లేట్ కనపించకుండా కొందరు రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పోలీసులు ఫొటోలు తీసిన తమ వాహనాల నంబర్‌ను గుర్తించలేరని వారు భావిస్తున్నారు. ఇలాంటి ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి.

ఈ నేపథ్యంలో అటువంటి వారికి సైబరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. తమ మేసేజ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా.. నరసింహ చిత్రంలో రజనీకాంత్ చెప్పే డైలాగ్‌ను తీసుకుని హెచ్చరికలు జారీచేశారు. ఆ చిత్రంలో రమ్యకృష్ణతో మాట్లాడుతున్న సందర్భంగా రజనీకాంత్.. "అతిగా ఆశ పడే ఆడది ,అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు" అని అంటాడు.

సైబరాబాద్ పోలీసులు కూడా ఆ డైలాగ్‌ మాదిరిగానే.. "అతిగా ఆశ పడే ఆడది ,అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు" అని ట్వీట్ చేశారు. అలాగే నెంబర్ ఫ్లేట్ కనబడకుండా అమ్మాయిలు బైక్స్ నడుపుతున్న ఫొటోను కూడా షేర్ చేశారు.

First published:

Tags: Cyberabad, TRAFFIC AWARENESS, Traffic police

ఉత్తమ కథలు