ప్రజలకు సమాచారాన్ని చేరువ చేయడంలోనూ, అలాగే తప్పులు చేయవద్దని చెప్పడంలోనూ ఇటీవల తెలంగాణ పోలీసులు భిన్నంగా ముందుకు వెళ్తున్నారు. సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. అయితే, అప్పుడప్పుడు ట్రోలింగ్ కూడా చేస్తుంటారు. ఆ ట్రోలింగ్స్ కూడా జనాలను ఆకట్టుకుంటున్నాయి. వారు ట్రోలింగ్ చేసేది కూడా తప్పును చూపించేందుకే కానీ, వ్యక్తిగతంగా ఎవరినీ ట్రోలింగ్ చేయడం లేదు. తాజా విషయానికి వస్తే ఓ యువకుడు ద్విచక్ర వాహనం నడుపుతున్నాడు. అయితే, అతడు మామూలుగా నడిపితే అందులో వింతే ముంది. ఆ కుర్రాడు హ్యాండిల్స్ మీద కాళ్లు పెట్టి వాహనాన్ని నడుపుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరో ఫొటో తీసి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు పంపారు. ఆ ఫొటోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. ‘చూడండి రా వాడిని, కోతికి కొబ్బరి చిప్ప ఇస్తే ఏం చేస్తది అని అడిగారు కదా.’ అంటూ కామెంట్ పోస్ట్ చేశారు. అందుకోసం వారు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీన్‌ను వినియోగించుకున్నారు.
ఈ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చాలా మంది దీనిపై కామెంట్లు, రీ ట్వీట్లు చేస్తున్నారు. లైక్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఆ నెంబర్ ప్లేట్ కూడా చూపించాల్సిందని సూచించారు.
చూడండి రా వాడిని, కోతికి కొబ్బరి చిప్ప ఇస్తే ఏం చేస్తది అని అడిగారు కదా.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/UySctRcfTJ
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) December 30, 2020
ఓ యూజర్ మాత్రం వీడెవడో మన గవర్నమెంట్ లాగా ఉన్నాడే అని కామెంట్ చేశారు.
vidu yevado mana present GOV laga unadu .. pic.twitter.com/VGZdDB8odr
— శరత్ చంద్ర (B+ Blood Group) (@sambhadu) December 30, 2020
తెలంగాణ పోలీసులు ఈ తరహాలో ట్రోల్ చేయడం, సినిమా వాటిని వినియోగించుకుని కొత్త కొత్త సెటైర్లు వేయడం ఇదే కొత్తకాదు. గతంలో కూడా పలుమార్లు చేశారు.
Be a citizen police.
Report a Traffic Violation. Capture the violation and send that image to Cyberabad E-challan WhatsApp: 9490617346 with Date, Time and Location.#RoadSafety pic.twitter.com/hsUVp2pF4d
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) December 29, 2020
తప్పు చేసిన వారిని ట్రోల్ చేయడమే కాదు. ప్రజల్లో రోడ్ సేఫ్టీ మీద అవగాహన పెంచేందుకు ట్విట్టర్ వేదికగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ మోగితే ఏం చేయాలంటూ యూజర్లను అడుగుతున్నారు. అలాగే, ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి వివరాలు తమకు తెలియజేయాలంటూ ప్రజలనుకోరుతున్నారు. అందుకోసం 9490617346 వాట్సప్ నెంబర్ కూడా ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cyberabad, Telangana Police, Twitter