Home /News /telangana /

CYBERABAD TRAFFIC POLICE SHARES DRUNK AND DRIVE BIKER FUNNY VIDEO IT GOES VIRAL SRD

Viral Video : కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ.. నడి రోడ్డుపై మందు బాబు డేంజర్ డ్రైవింగ్ విన్యాసాలు..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : కొందరు వాహనదారులు మాత్రం.. అయితే నాకేంటి అన్నట్లు… నిత్యం ఫూటుగా తాగి రోడ్లపైకి వస్తున్నారు. నడి రోడ్లపై వింత విన్యాసాలతో ఇతర వాహనాలదారులకు అగ్ని పరీక్షలు పెడుతున్నారు. తద్వారా సొంత ప్రాణాలతో పాటు రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారుల ప్రాణాలతోనూ మందుబాబులు చెలగాటమాడుతున్నారు.

ఇంకా చదవండి ...
    మందు బాబులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో మర్చిపోతున్నారు. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మద్యం తాగి బండి నడపొద్దని పదే పదే చెప్తున్నా.. కొందరికి ఇంకా చెవికెక్కడం లేదు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై నిఘా పెంచినా మందుబాబుల ఆగడాలకు కళ్లెంపడ్డంలేదు. వాళ్ల లైఫ్‌ రిస్క్‌లో పడ్డమే కాదు..ఎదుటోళ్ల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారు. ఇంకొందరు ఫుల్ గా మద్యం సేవించి బిజీగా ఉండే రోడ్లపై ఇష్టానుసారం నడుస్తున్నారు. దీంతో వీరి చేష్టలతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారడమే కాకుండా అనవసరంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయ్. చావుతోనే చెలగాటమాడుతున్నారు.తాగి బండి నడిపితే ఎదురయ్యే అనర్థాలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనాలను సీజ్ చేసి మందుబాబుల నుంచి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయినా కొందరు వాహనదారులు మాత్రం.. అయితే నాకేంటి అన్నట్లు… నిత్యం ఫూటుగా తాగి రోడ్లపైకి వస్తున్నారు. నడి రోడ్లపై వింత విన్యాసాలతో ఇతర వాహనాలదారులకు అగ్ని పరీక్షలు పెడుతున్నారు. తద్వారా సొంత ప్రాణాలతో పాటు రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారుల ప్రాణాలతోనూ మందుబాబులు చెలగాటమాడుతున్నారు.

    ఇలా తాగిన మత్తులో ఓ బైకర్ చేసిన విన్యాసాలు పూర్తిగా సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ సీసీటీవీ ఫూటేజీని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైకర్ కిందపడి లేచి…ఎదురుగా, వెనుక వెపు నుంచి వచ్చే ఇతర వాహనాలకు అడ్డంగా బైక్‌ను నడపడం, రోడ్డుపై వెళ్తున్న మరో కారును గుద్దడం ఇందులో రికార్డు అయ్యింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని కోరుతూ సైబరాబాద్ పోలీసులు ఈ వీడియోను షేర్ చేయగా..సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది. " కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ... మద్యం మత్తులో " అనే క్యాప్షన్ ఇచ్చారు. రోడ్డంతా నాదే అన్నట్లు సాగే ఆ మందుబాబు డ్రైవింగ్ విన్యాసాలు నవ్వులు పూయించడమే కాదు.. డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనతో పాటు రోడ్డుపై వెళ్లే ఇతరులకు ఎంత ప్రమాదకరమో ఈ వీడియో అద్దంపడుతోంది.


    ఇంతకీ ఆ వ్యక్తి క్షేమంగా తన ఇళ్లు వెళ్లి చేరాడా లేదా? అని ఓ నెటిజన్ ఆరా తీయగా..స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మన పొరబాటు లేకుండానే ఇతరుల రాష్ డ్రైవింగ్‌తో ప్రాణాలు పోయే రోజులివి… స్వల్ప గాయాలతో ఇళ్లు చేరిన అతను లక్కీ ఫెలో అంటూ ఆ నెటిజన్ కామెంట్ చేశాడు. మరోవైపు జరిమానాలు విధించినా..జైలుకు పంపుతున్నా మందు బాబుల ఆగడాలకు మాత్రం కళ్లెం పడ్డంలేదు. తాగిన మైకంలో యాక్సిడెంట్లు చేయడం..అడ్డుకున్న పోలీసులతో వాగ్వావదానికి దిగడం..దాడులకు సైతం పాల్పడ్డం నిత్యకృత్యాలవుతున్నాయి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cyberabad police, Drunk and drive, Hyderabad, Telangana, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు