Home /News /telangana /

CYBERABAD TRAFFIC POLICE GAVE SHOCK TO A BIKER BY IMPOSE FINE RS 3600 AT A TIME VRY

Traffic police : ఒక్క బైకర్.. ఆరు ఉల్లంఘనలు..ఒకేసారి రూ.3600 ఫైన్...! ఇది ఎలా సాధ్యం..?

Traffic police : ఒక్క బైకర్.. ఆరు ఉల్లంఘనలు..ఒకేసారి రూ.3600 ఫైన్...! ఇది ఎలా సాధ్యం..?

Traffic police : ఒక్క బైకర్.. ఆరు ఉల్లంఘనలు..ఒకేసారి రూ.3600 ఫైన్...! ఇది ఎలా సాధ్యం..?

Cyberabad Traffic police : సైబరాబాద్ పోలీసులు ఓ బైకర్‌కు తమ మార్క్ చూపించారు...ఒక్క బైకర్‌కు ఒకేసారి 3600 రూపాయల ఫైన్ విధించి షాక్ ఇచ్చారు...అయితే ఆ బైకర్ ఉల్లంఘించిన నిబంధనలు చూస్తే..మీరే పరేషాన్ అవుతారు..ఇలాంటీవాటికి ఫైన్‌లు వేయక తప్పదనే ఫిలింగ్‌లోకి వెళతారు...

ఇంకా చదవండి ...
    హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక్కోసారి ఒక్కొ విధంగా స్పందిస్తారు....ట్రాఫిక్ రూల్స్‌ని నిక్కచ్చిగా పాటించాలనే లక్ష్యంతో పోలీసులు వ్యవహరిస్తారు..ఈ క్రమంలోనే వేల రూపాయల ఫైన్‌లు వేసి మరోసారి ఇలాంటీ తప్పులు చేయకుండా ముందుజాగ్రత్తగా హెచ్చరిస్తారు..ఇలా వారి నిర్ణయాన్ని ప్రజలకు వివరించి...వాళ్లు అలాంటి తప్పు చేయకుండా చర్యలు చేపడతారు.

    ఈ నేపథ్యంలోనే సాధరణంగా హెల్మెట్ లేని వారికి, రాంగ్ రూట్లో వెళ్లిన వారికి , నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఒక్క విధంగా జరిమాన విధిస్తారు...కాని చాలా సంధర్భాల్లో ఒక్క బైకర్ రెండు మూడు తప్పులు చేసినా..దానికి ఏదో ఒక ఫైన్ వేసి పంపిస్తారు...

    కాని తాజాగా ఓ బైకర్‌ ఒకేసారి మూడు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను మూడు రకాల జరిమానాలు విధించి మొత్తం 3600 రూపాలయలను జరిమానగా విధించారు..

    ఇక ఆఫోటోకు రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు..పట్టుతప్పితే..మునిగిపోతాయి ప్రాణాలు ...అంటూ ఓ ట్యాగ్ లైన్‌కూడా విడుదల చేసి సోషల్ మీడియాలో విడుదల చేశారు..దీంతో ఆఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఇంతకి ఆ బైకర్ ఉల్లంఘించిన నిబంధనలు ఏమిటంటే
    బైక్ పై మొత్తం ముగ్గురు వెళుతున్నందుకు గాను రూ.1200
    డ్రైవర్ హెల్మెట్ ధరించనందుకు గాను రూ. 200
    బైక్‌కు సైడ్ మిర్రర్ లేనందుకు రూ.100
    సెల్‌ఫోన్ చూస్తూ..డ్రైవింగ్ చేసినందుకు గాను రూ. 1000
    బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించనందుకు రూ.1000
    ఇక బైక్‌పై కూర్చున్న మరో వ్యక్తికి రూ.100 గా జరిమాన విధించారు..ఇందులో పోలీసులు కొంత జాలి మాత్రం చూపించారు..మొత్తం ముగ్గురు వెళుతున్నప్పడు మూడో వ్యక్తికి కూడా హెల్మెట్ లేకుండా ఉన్నా ఓ వంద రూపాయల ఫైన్ మాత్రం వేయలేదు.

    ఇలా ఒకే వ్యక్తికి ఒకేసారి మొత్తం 3600 రూపాలయను ఫైన్ గా విధించడం ద్వార ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  సో ట్రాఫిక్ పోలీసులు లేరు కదా..అని ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఇదొక హెచ్చరిక లాగా తీసుకుని ఇలాంటీ పొరపాట్లు చేయకుండా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. మొత్తం ఒకేసారి అంతపెద్ద మొత్తంలో జరిమాన విధించిన అది ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకునే అంటూ కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించగా..మరికొంత మాత్రం ఒకేసారి బైక్‌కు 3600లు పైన్ విధించడంపై పెదవి విరిచారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Cyberabad police, Telangana, Traffic fine

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు