మూసాపేటలో ఫుట్‌పాత్‌పై పసికందు.. రక్షించి శిశు విహార్‌కు అందజేసిన పోలీసులు..

సమాజంలో ఆడ పిల్లల విషయంలో మార్పు రావడం లేదు. ఇప్పటికి చాలా మంది ఆడ పిల్లలు పుట్టకూడదనే కోరుకుంటున్నారు.

news18-telugu
Updated: October 23, 2020, 7:26 AM IST
మూసాపేటలో ఫుట్‌పాత్‌పై పసికందు.. రక్షించి శిశు విహార్‌కు అందజేసిన పోలీసులు..
ఫుట్‌పాత్‌పై పడి ఉన్న శిశువును రక్షించిన పోలీసులు(Photo-Twitter/SAITEZAA)
  • Share this:
సమాజంలో ఆడ పిల్లల విషయంలో మార్పు రావడం లేదు. ఇప్పటికి చాలా మంది ఆడ పిల్లలు పుట్టకూడదనే కోరుకుంటున్నారు. కాలం మారుతున్న ఈ ధోరణి మారడం లేదు. కొందరు చట్ట విరుద్ధంగా స్కానింగ్‌లు చేయిస్తుంటే.. మరికొందరు ఆడ శిశువులు  పుట్టగానే వదలించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికి రోడ్లపై, చెత్తకుప్పలలో అప్పుడే పుట్టిన ఆడ శిశువులను పడేసిన ఘటనలను ఎక్కడో ఒకచోట చూస్తునే ఉన్నాం. తాజాగా ఇలాంటి హైదరాబాద్‌లోని మూసాపేటలో చోటుచేసుకుంది. అయితే ఫుట్‌పాత్‌పై పడి ఉన్న పసికందును చూసి హైదరాబాద్ పోలీసులు చలించిపోయారు. వెంటనే పసికందును రక్షించి.. శిశు విహార్‌కు తరలించారు.

వివరాలు.. పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో పోలీసులకు మూసాపేటలోని ఫుట్‌పాత్ ఆడ శిశువు పడివేసి ఉండటం కనిపించింది. దీంతో తక్షణమే స్పందించిన పోలీసులు..ఆ పసికందును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముందుగా శిశువుకు స్నానం చేయించారు. అనంతరం కొత్త బట్టలు వేసి.. చైల్డ్ లైన్(శిశు విహార్ ప్రతినిధులకు అందజేశారు.

పోలీసుల కృషిని సైబరాబాద్ సీపీ కార్యాలయం ట్విటర్ వేదికగా ప్రశంసించింది. కూకట్‌పల్లి పోలీసులు తమ విధులను అద్భుతంగా నిర్వర్తించారని కొనియాడారు. ప్రజా భద్రత అనేది సైబరాబాద్ పోలీసుల ముఖ్య కర్తవ్యమని తెలిపారు.



ప్రజలు ఏదైనా సమస్య ఉంటే.. డయల్ 100కు గానీ, వాట్సాప్ నెంబర్ 9490617444కు గానీ సమాచారం అందించాలని కోరారు. తెలంగాణ పోలీసులు విధులు ఎంత సక్రమంగా, జాలి గుణంతో నిర్వహిస్తారనేది దానికి మరో ఉదాహరణ అని చెప్పారు.
Published by: Sumanth Kanukula
First published: October 23, 2020, 7:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading