Home /News /telangana /

CYBERABAD POLICE HAVE ARRESTED OF FACK CBI GANG IN AP VRY

Fake CBI : స్పెషల్ 26.. సినిమా చూసి దోపిడి... రియల్ వ్యాపారి వద్ద పనిచేసే వ్యక్తి సూత్రదారి..

arrest

arrest

Fack CBI : సిబిఐ అధికారులమంటూ గచ్చిబౌలిలోని ఓ ఇంటిలో డబ్బు, బంగారాన్ని ఎత్తుకెళ్లిన ముఠా సభ్యులు హిరో అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ చబ్బీస్ సినిమా చూసి ఇన్‌స్పైర్ అయినట్టు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసుకు సూత్రదారి రియల్ వ్యాపారి వద్ద పని చేసే ఓ వ్యక్తి కావడం గమనార్హం.

ఇంకా చదవండి ...
    గత రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని ఓ రియల్ ఎస్టెట్ వ్యాపారి ఇంట్లో సిబిఐ అధికారులమంటూ సుమారు కోటి ఇరవై లక్షల రూపాయాల విలువగల బంగారం, డబ్బును ఎత్తుకెళ్లిన డెకాయిట్స్ ఓ సినిమా చూసి ఫాలో అయినట్టు పోలీసులు వెల్లడించారు. ముఠా సభ్యులను నేడు ఉదయం రాజమహేంద్రవరంలో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కాగా వీరంతా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారిగా సీపీ స్టిఫెన్ రవీంద్ర తెలిపారు. కాగా వీరిని నేడు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

    కాగా దోపిడికి సూత్రదారి రియల్ వ్యాపారి వద్ద పని చేస్తున్న జస్వంత్ అనే వక్తిగా గుర్తించారు. రియల్ వ్యాపారి సుబ్రమణ్యం వద్ద చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. దీంతో ఆయన వద్ద బ్లాక్‌మని ఉండడంతో పాటు ఒకవేళ దోపిడి చేసినా కేసులు ఉండవనే విశ్వాసంతో జస్వంత్ తన మిత్రులతో కలిసి ప్లాన్ చేసినట్టు చెప్పారు. వీరంతా మాదాపూర్‌లోని ఓ రూం తీసుకుని ఆ తర్వాత తెలిసిన ఓ ఎర్టిగా కారును కిరాయకు తీసుకుని ఆ తర్వాత కారు నంబర్ ప్లేట్ సైతం మార్చారు. తదనంతరం అర్వింద్ తన మిత్రులతో కలిసి ముందుగా రెక్కి నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంట్లోకి వెళ్లి కేవలం కేవలం 15 నిమిషాల్లో మొత్తం కోటి విలువ గల బంగారంతో పాటు డైమండ్స్ ఎత్తుకుని వెళ్లారు. కాగా కేసులో మొత్తం ఎనమిది నిందితులు పాల్గొనట్టు కమీషనర్ తెలిపారు. కాగా వారిలో ముగ్గురు పరారీలో ఉండగా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CBI, Crime, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు