పోలీసులను గన్‌తో కాల్చబోయారు.. సజ్జనార్ ప్రెస్‌మీట్..

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్పందించారు. ఘటనాస్థలి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.

news18-telugu
Updated: December 6, 2019, 3:34 PM IST
పోలీసులను గన్‌తో కాల్చబోయారు.. సజ్జనార్ ప్రెస్‌మీట్..
వీసీ సజ్జనార్
  • Share this:
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్పందించారు. ఘటనాస్థలి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఘటనాస్థలిలో దాచిపెట్టిన సెల్‌ఫోన్, ఇతర ఆధారాలను సేకరించేందుకు నిందితులను తీసుకొచ్చామని, అయితే.. వాళ్లు పోలీసులపై దాడికి దిగారని తెలిపారు. నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు కలిసి మూకుమ్మడిగా రాళ్లు, కర్రలతో పోలీసులను కొట్టబోయారని, ఆరిఫ్, చెన్నకేశవులు పోలీసుల వద్ద గన్స్ లాక్కుని ఫైర్ చేశారని చెప్పారు. ఈ ఘటనలో ఎస్సైకి, కానిస్టేబుల్‌ తలకు గాయాలయ్యాయని అన్నారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం వారిపై కాల్పులు జరిపారని ఆయన వెల్లడించారు. గాయపడిన పోలీసులను కేర్ ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. నిందితులు ముందే అరాచకాలకు పాల్పడ్డట్లు అనుమానం ఉంది. ఏపీ, తెలంగాణలోని పలు కేసులను పరిశీలిస్తున్నట్లు వివరించారు.

ఎన్‌కౌంటర్ ఉదయం 5:40 నుంచి 6:30 మధ్య జరిగిందని స్పష్టం చేశారు. అటు.. దిశ తల్లిదండ్రుల ప్రైవసీని కాపాడాలని కోరుతున్నామని ఆయన చెప్పారు.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>