CYBERABAD CYBER CRIME WING RELEASED A SPECIAL VIDEO ON AWARENESS ABOUT WHICH THINGS WILL NOT DO IN INTERNET HSN
సీక్రెట్ ప్లేస్ లో టాటూ.. స్నేహితుడికి పంపిన యువతి.. మరుసటి రోజే వీధుల్లో ప్రత్యక్ష్యం.. సైబర్ క్రైమ్ పోలీసుల వీడియో వైరల్
సైబర్ క్రైమ్ డిాపార్ట్మెంట్ విడుదల చేసిన ప్రచార వీడియో ఫొటో
హైదరాబాద్ పరిధిలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోవడంతో పోలీసులు నష్ట నివారణ చర్యలను చేపడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో వినూత్నమైన రీతిలో యాడ్స్ రూపొందించిన సంగతి తెలిసిందే.
రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల ఎంత మేలు జరుగుతోందో, అంతే స్థాయిలో అక్రమాలు కూడా జరుగుతున్నాయి. నయా మోసాలకు ఇంటర్నెట్ అడ్డాగా మారిపోయింది. ఒకప్పుడు దొంగలు అంటే గుబురు మీసాలు, బుగ్గకు ఓ పెద్ద పుట్టుమచ్చ, లుంగీ, బనియన్.. వంటి రూపురేఖలతో సినిమాల్లో చూపించేవారు. బయట కూడా దొంగలు, రౌడీలను కూడా ఈజీగా గుర్తుపట్టేసేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. టై కట్టుకుని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లా బిల్డప్ ఇస్తూ టిప్ టాప్ గా చోరీలు చేస్తున్నారు. ఇంట్లోంచి కాలు బయటకు పెట్టుకుండానే నెట్టింట నయా మోసాలకు నాంది పలుకుతున్నారు. మామమాటలు చెప్పి అమాయక నెటిజన్లను నమ్మిస్తున్నారు. వారి ఆశలను, బలహీనతలను ఆసరాగా చేసుకుని కోట్లకు కోట్లు డబ్బును కొల్లగొడుతున్నారు.
ఇటీవల సైబర్ మోసాలు బాగా పెరిగిపోతుండటంతో పోలీసు శాఖ అప్రమత్తమయింది. హైదరాబాద్ పరిధిలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోవడంతో పోలీసులు నష్ట నివారణ చర్యలను చేపడుతున్నారు. ప్రజల్లో వీటిపై అవగాహనను పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో వినూత్నమైన రీతిలో యాడ్స్ రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ పోలీసు శాఖ అలాంటి ప్రయత్నాన్నే మరోసారి చేసింది. ఓ వినూత్న యాడ్ ను రూపొందించింది.
బయట ఎక్కడ చేయకూడానివి INTERNET లో కూడా పెట్టకండి.. అనే ఉద్దేశంతో ఆ యాడ్ రూపొందింది. ఓ యువతికి ఇంటర్నెట్ లో ఓ కుర్రాడు పరిచయం అవుతాడు. వారి మధ్య పరిచయం మరింత ముదిరి పర్సనల్ ఫొటోలను పంపేదాకా వెళ్తుంది. తన గుండె భాగంపై ఆ యువతి వేసుకున్న ఓ టాటూ ఫొటోను ఆ యువకుడు అడుగుతాడు. భయపడుతూనే అతడిపై ఉన్న నమ్మకంతో ఆ ఫొటోను పంపిస్తుంది. ఇంకేముంది మరుసటి రోజే ఆ ఫొటో వీధుల్లో ఫొటోగా ప్రత్యక్షమవుతుంది. అది చూసి ఆమె కంగుతింటుంది. ’బయట ఎక్కడా చేయని పనులను, ఇంటర్నెట్ లో కూడా చేయకూడదు‘ అని ఆమె నిర్ణయానికి వస్తుంది. ఓ పాట రూపంలో ఈ సారాంశాన్ని చెప్పే వీడియోను Cyber Crimes Wing Cyberabad తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అది కాస్తా ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.