ఏపీ ప్రజల డేటా చౌర్యం కేసులో ఎంత పెద్దలున్నా వదలిపెట్టేది లేదు: తెలంగాణ పోలీసులు

సున్నితమైన డేటా చౌర్యం కేసులో ఏపీ ప్రభుత్వ పాత్ర ఉందని సైబరాబాద్ సీపీ నిర్ధారించారు. సంక్షేమ పథకాల లబ్ది దారుల సమాచారం ప్రభుత్వం తప్ప ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉండే అవకాశం లేదన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆధార్ అధికారులతో పాటు కేంద్ర ఎన్నికలసంఘానికీ, డేటాను హోస్ట్ చేసిన అమెజాన్ సంస్ధకూ ఫిర్యాదు చేశామన్నారు.

news18-telugu
Updated: March 4, 2019, 4:53 PM IST
ఏపీ ప్రజల డేటా చౌర్యం కేసులో ఎంత పెద్దలున్నా వదలిపెట్టేది లేదు: తెలంగాణ పోలీసులు
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్
  • Share this:
ఏపీ ప్రజల డేటాచౌర్యం కేసులో ఎంత పెద్దలున్నా వదలిపెట్టే ప్రసక్తే లేదని సైబారబాద్ సీపీ సజ్జనార్ స్పష్టంచేశారు. ఐటీ గ్రిడ్ సంస్థ దగ్గర ఏపీ ప్రజల ఆధార్, ఓటర్ కార్డ్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వారి కులాల వివరాలు ఉన్నాయని..వాటిని ఎందుకు సేకరించారు? ఎలా సేకరించారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఈ కేసులో ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్‌ని ప్రధాన నిందితుడిగా గుర్తించామని..తన వద్ద ఉన్న డేటాతో సరెండర్ కావాలన్నారు సజ్జనార్. హైదరాబాద్ నుంచే డేటా చోరీ అయినందున.. తెలంగాణ పోలీసులే కేసును దర్యాప్తు చేస్తారని స్పష్టంచేశారు. కేసులో మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ, ఈసీకి లేఖ రాశామని తెలిపారు. మిస్సింగ్ కేసుతో హైదరాబాద్ వచ్చి ఏపీ పోలీసులు ఓవర్ చేశారని విమర్శించారు.

ఐటీ గ్రిడ్ సంస్థ ఏపీ ప్రజల వ్యక్తిగత, సునిశిత సమాచారాన్ని భద్రపరిచినట్లు గుర్తించాం. వారి దగ్గర ఏపీ ప్రజల ఆధార్, ఓటర్ కార్డ్, ప్రభుత్వ లబ్ధి వివరాలు ఉన్నాయి. ఐటీ గ్రిడ్ సంస్థ టీడీపీకి చెందిన సేవా మిత్ర యాప్ నిర్వహిస్తోంది. ఆ యాప్‌లో ఓటర్ల పేర్లు, చిరునామా వివరాలు ఉన్నాయి. అందులో డేటా హైదరాబాద్ నుంచే చోరీ అయిందనందున తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేస్తారు. ఈ కేసులో అమెజాన్ సంస్థకు నోటీసులు జారీ చేశాం. కేసులో మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ, ఈసీకి లేఖ రాశాం. ఈ డేటాతో ఎవరినినైనా బ్లాక్ మెయిల్ చేయవచ్చు. ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను రెండు రోజుల పాటు విచారించాం. లబ్ధిదారుల డేటాను ఎలా సేకరించారు? వారి దగ్గర ఎందుకు ఉంచుకున్నారు? దర్యాప్తులో తేలుతుంది.
సజ్జనార్, సైబరాబాద్ సీపీ


ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు సజ్జనార్. ఏపీలో ఓట్ల తొలగింపునకు సంబంధించి 50 చోట్ల కేసులు నమోదయ్యాయని.. డేటా ఆధారంగా ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించారా అన్నది విచారించాలని ఆయన తెలిపారు. కాగా, ఏపీ పౌరుల డేటాను అక్రమంగా సేకరించారని మార్చి 2న తుమ్మల లోకేశ్వరరెడ్డి అనే వ్యక్తి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సేవా మిత్ర యాప్ ద్వారా ఐటీ గ్రిడ్ సంస్థ పౌరుల వ్యక్తిగత డేటాను సేకరించి దుర్వినియోగం చేస్తోందని ఫిర్యాదు పేర్కొన్నారు. ఆ మేరకు 120బి,379,420,188 ఐపీసీ,72&66బి కేసులు పెట్టిన పోలీసులు..ఐటి గ్రిడ్స్ ఉద్యోగులు రెగొండ భాస్కర్, కందులూరి ఫణికుమార్, రెబ్బల విక్రమ్ గౌడ్, గురుడు చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ల్యాప్‌టాప్స్, హార్డ్ డిస్క్‌లో సేకరించిన డేటాను ఎఫ్ఎస్ఎల్‌కు పంపించనున్నారు పోలీసులు.

సున్నితమైన డేటా చౌర్యం కేసులో ఏపీ ప్రభుత్వ పాత్ర ఉందని సైబరాబాద్ సీపీ నిర్ధారించారు. సంక్షేమ పథకాల లబ్ది దారుల సమాచారం ప్రభుత్వం తప్ప ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉండే అవకాశం లేదన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆధార్ అధికారులతో పాటు కేంద్ర ఎన్నికలసంఘానికీ, డేటాను హోస్ట్ చేసిన అమెజాన్ సంస్ధకూ ఫిర్యాదు చేశామన్నారు. అమెజాన్ వెబ్ సర్వర్ల నుంచి మరిన్ని వివరాలు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ఐటీ గ్రిడ్స్ సీఈవో దాకవరపు అశోక్ కోసం ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో గాలింపు సాగుతోందని, ఆయన పొరుగు రాష్ట్రంలో ఉన్నా పట్టుకుని తీరుతామన్నారు.

 

ఇవి కూడా చదవండి:

మూలాలు కదలిపోతాయ్..ఖబడ్దార్...కేసీఆర్, జగన్‌కు చంద్రబాబు వార్నింగ్

టీడీపీ, వైసీపీ మధ్య డేటా యుద్ధం... ఫామ్ 7 అంటే ఏంటి?
First published: March 4, 2019, 4:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading