Home /News /telangana /

CYBER FRAUDERS USING TELUGU PERSONS TO DO FRAUD VRY

Cyber crime : మన కంటిని మన వేళ్లతోనే పొడుస్తున్నారు.. సైబర్ మోసానికి కొత్త ప్లాన్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cyber crime : సైబర్ ముఠా సరికొత్త ప్లాన్‌కు తెరతీశారు.. తెలుగు వారిని మోసం చేసేందుకు తెలుగువారినే వాడుకున్నారు.ఇక్కడి వారితో పరిచయం పెంచుకుని వారితోనే మోసాలు ఎలా చేయాలనే దానిపై ట్రైనింగ్ ఇస్తూ భారీ టార్గెట్ చేశారు.

    సైబర్ క్రైంలో ఆరితేరిన ముఠాలు భాషపై అనుమానం రాకుండా వ్యవహించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలను మోసం చేసేందుకు ఇక్కడి వారినే పావులుగా వాడుకున్నారు. దీంతో డబ్బులు నిర్వాహాకులకు కేసుల్లో మాత్రం తెలుగు యువకులు ఇరుక్కున్నారు. కాగా సైబర్ మోసాలపై ఉక్కుపాదం మోపుతున్న నగర పోలీసులు ఇటివల అనేక గ్యాంగ్‌లను అరెస్ట్ చేస్తున్న క్రమంలోనే ఈ భారీ స్కెచ్ బయటపడింది.

    వివరాల్లోకి వెళితే... జార్ఖండ్‌కు చెందిన విక్రమ్ ఠాగూర్ అనే సైబర్ నేరగాడు తరచుగా హైదరాబాద్‌కు వస్తుండేవాడు. అయితే ఇలా రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ఠాగూర్ నగరంలోని ఆటో నడుపుతున్న కట్రవత్ రాజు ఆటోలో తిరుగుతూ పరిచయం పెంచుకున్నాడు. దీంతో ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన రాజు ఆటోలోనే తిరిగే వాడు. ఈ క్రమంలోనే తన సైబర్ మోసానికి సంబంధించి రాజును లైన్‌లో పెట్టాడు. బ్యాంకు లోన్స్, ఫైనాన్స్ సర్వీసెస్ పేరుతో, అధిక డబ్బు ఆశ చూపి మాయ చేశాడు. ఈ క్రమంలోనే స్పష్టంగా తెలుగు మాట్లాడే వారు కావాలని చెప్పాడు. అలా తనతో వెళ్లిన వారికి వచ్చిన డబ్బులో ముప్పై శాతం ఇస్తానని ఆశ చూపాడు.

    Adilabad : ఆ.. అభయారణ్యంలో అరుదైన పక్షులు.. కనిపిస్తున్న సుందర దృశ్యాలు..


    ఈ క్రమంలోనే ఠాగూర్ ప్లాన్‌ను రాజు తన సొంత గ్రామం వనపర్తి జిల్లా పెద్దమందడి గ్రామంలో అమలు చేశాడు. గ్రామానికి చెందిన మొత్తం ఎనిమిది మందిని తీసుకుని జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చేరుకున్నాడు. అక్కడ వారిని రీసీవ్ చేసుకున్న ఠాగూర్ ముందుగా షెల్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత పలు కంపనీలు సిమ్ కార్డులు ఇచ్చి మోసానికి తెరతీశాడు. లోన్స్, ఫైనాన్స్ సర్వీసెస్ పేరుతో జనాలను ట్రాప్ చేయడం ప్రారంభించారు. ఇలా తెలుగు వారిని టార్గెట్ చేసేందుకు తెలుగు వారినే వాడుకుని డబ్బు సంపాదనకు దిగారు. ఇలా గత ఏడాది కాలంగా మోసాలు చేస్తూ ఠాగూర్ ఇచ్చిన డబ్బుతో గ్రామానికి వచ్చి ఆ యువకులు జల్సాలు చేసేవారు.

    Waranagal : ప్రియుడి డబ్బుతోనే కిడ్నాప్..భయపెట్టి, బలవంతంగా.. అడవిలోకి తీసుకువెళ్లింది..ఆ తర్వాత..

    ఇలా ధన్‌బాద్ నుండి మోసాలకు దిగడంతో మోసపోయిన బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసులను నమోదు చేసుకున్న పోలీసులు పక్కా స్కెచ్‌తో ధన్‌బాద్‌కు వెళ్లి మోసం చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. అయితే ఇంతమంది తీసుకువెళ్లి దందాలు నిర్వహించిన ఠాగూర్‌ను మాత్రం అరెస్టే చేసేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. వాడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేసిన స్థానిక ధన్‌బాద్ పోలీసులు సహకరించలేదు. స్థానిక కోర్టు ఆర్డర్స్ లేకుండా వాడిని అప్పగించమని తేల్చి చెప్పారు. తెలంగాణకు చెందిన 9మందిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. కాగా ఈ గ్యాంగ్‌పై నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CYBER CRIME, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు