హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cyber Fraud : రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. వారి వలలో మరో వ్యక్తి బలి.. పోలీసులను ఆశ్రయించిన అతడు చివరకు..

Cyber Fraud : రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. వారి వలలో మరో వ్యక్తి బలి.. పోలీసులను ఆశ్రయించిన అతడు చివరకు..

Cyber Fraud : టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోతుందో అంతే వేగంగా కేటుగాళ్ల మోసాలు కూడా రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతూ దూసుకుపోతున్నాయి. ఉచిత ఇన్సూరెన్స్ పేరుతో ఓ అమాయకుడిని మోసం చేసిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది.

  ఓ వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి డేటాను సైబర్ నేరగాళ్లు సంపాదించారు. అతనికి సంబంధించి పూర్తి వివరాలను తెసుకున్నారు. అతడు ఏ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నాడో కూడా తెలసుకొని ఓ రోజు అతడికి ఓ అమ్మాయితో కాల్ చేయించారు. అతని క్రెడిట్ కార్డుకు సంబంధించిన సంస్థ నుంచి ఫోన్ చేస్తున్నానని.. క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నట్లు నమ్మించింది. మీ క్రెడిట్ కార్డు ఉచిత ఇన్సురెన్స్ పథకానికి ఎంపికైందని అంటూ.. అతడి పేరు, ఊరు, పుట్టిన రోజు, విద్యార్హత వంటి డేటా మొత్తం అడిగి తెలుకుంది. ఆమె అడిని ప్రతీ విషయానికి సమాధానం చెప్పాడు. అందులో ఓటీపీ నంబర్ కూడా చెప్పడంతో క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయి. మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

  జీడిమెట్ల చింతల్‌ ప్రసూన నగర్‌కు చెందిన గుళ్లపల్లి కిషోర్‌ ప్రైవేట్‌ సంస్ధలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను స్టాండర్డ్‌ చార్టెడ్‌ క్రెడిట్‌ కార్డును ఉపయోగిస్తున్నాడు. ఓ రోజు కిషోర్‌ ఫోన్‌కు వరినీక అనే పేరుతో ఓ అమ్మాయి ఫోన్‌ చేసి తాను స్టాండర్డ్‌ చార్టెడ్‌ క్రెడిట్‌ కార్డు కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నానని హిందీలో మాట్లాడి పరిచయం చేసుకుంది. అనంతరం మీ క్రెడిట్‌ కార్డు నెంబర్ ఉచిత ఇన్సూరెన్స్ పథకానికి ఎంపికైందని చెప్పి అతడి వివరాలు అడిగి తీసుకుంది. దీంతో కిషోర్‌ తన పేరు, కార్డ్‌ నంబర్, పుట్టిన తేదీ, కార్డు వ్యాలిడిటీ అన్నీ చెప్పాడు. అనంతరం మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది… అది చెప్పండి అని అడగ్గా కిషోర్‌ ఆమెను గుడ్డిగా నమ్మి ఫోన్ కు వచ్చిన ఓటీపీ చెప్పేశాడు.

  వెంటనే అతడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ.98 వేలు వాడుకున్నట్లు మెసేజ్ వచ్చింది. ఈ విషయాన్ని సదరు అమ్మాయికి తెలపగా మళ్లీ ఇంకో ఓటీపీ వస్తుందని, అది చెప్తే రూ.98 వేలు తిరిగి మీ అకౌంట్‌కు వస్తాయని చెప్పింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన కిషోర్‌ ఫోన్‌ కట్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. ఎట్టి పరిస్థితల్లో ఓటీపీ, వ్యక్తి గత వివరాలు చెప్పొద్దని పోలీసులు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటువంటి ఫోన్ కాల్స్ కు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

  First published:

  Tags: Crime news, CYBER CRIME, CYBER FRAUD, Hyderabad, ONLINE CYBER FRAUD

  ఉత్తమ కథలు