CYBER FRAUD ARRESTED WHO IS DOING ONLINE FRAUD BUSINESS VRY
CP Sajjanar : తక్కువ ధరలకే ఇంటి సరుకులు....సైబర్ వలలో బాధితులు
సైబారాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (ఫైల్ ఫోటో)
CP Sajjanar :నిత్యవసర వస్తువులు చాలా తక్కువ ధరకంటూ ప్రకటనలు చూసి మోసకపోకండి..డిస్కౌంట్స్.. ప్రకటనలు చూసి ఆన్లైన్ షాపింగ్ చేయడంతోపాటు ఇంటి కిరాయ దారులను కూడా ఫిజికల్‌గా చూడకుండా ఆన్లైన్ కార్యాకలాపాలను నిర్వహించవద్దని సీపీ సజ్జనార్ సూచించారు. ఇలా మోసం చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.
అనేక రూపాల్లో ఉంటున్న సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు ఎప్పటికప్పుడు నగర పోలీసులు అప్రమత్తవుతున్నారు. బాధితులను ఫిర్యాదు తర్వాత సైబర్ నేరగాళ్లు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పట్టుకువచ్చేందుకు పకడ్బంధి వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఇలాంటీ సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు మొత్తం 36 స్టేషన్ల పరిధిలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్టు సైబరాబాద్ సీసీ సజ్జనార్ తెలిపారు.
ఈ నేపథ్యంలోనే..ఫేక్ వెబ్ సైట్ క్రియేట్ చేసి తక్కువ ధరకు ఫర్నీచర్, నిత్యావసర వస్తువులు ఇస్తానంటూ మోసం చేస్తున్న వ్యక్తిని సైబర్ క్రైం, రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా మరో నిందితుడు పరారీలో ఉన్నాట్టు సీపీ సజ్జనార్ తెలిపారు...నిందితుడి నుండి 40 లక్షల నగదు, 20 డెబిట్ కార్డులు, 6 బ్యాంక్ పాస్ బుక్స్, 2 లాప్ టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.కాగా యూపీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిషబ్ ఉపాధ్యాయ బెంగళూరు కేంద్రంగా www.Zopnow.in,www.mondayfurniture.in పేరుతో అమాయకుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నాడని వివరించారు.
కాగా రిషబ్ పై సైబరాబాద్‌లో 9 కేసులున్నాయని చెప్పారు. మోసగాడి వలలో దేశవ్యాప్తంగా చాలా మంది బాధితులున్నారని, వారంతా సమీప పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఇక ఏదైనా ఆన్లైన్ వెబ్సైట్ విజిట్ చేసే ముందు అది అధికారికంగా ఉందా లేదా ..అని తెలుసుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి మీద ఉందని సూచించారు. ఈ క్రమంలోనే ఆన్లైన్లో వస్తువులు కొనేటప్పుడు వస్తువు డెలివరీ అయ్యాక డబ్బులు పే చేయాలని వివరించారు.
ఇక ఇంటి కిరాయిల పేరుమీద కూడా చాలా మంది సైబర్ నేరగాళ్లు డబ్బులు కొళ్లకొడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా ఇంటిని చూడకుండానే ఇళ్లు నచ్చిందని కిరాయ మరియు అడ్వాన్స్ ఇస్తామని చెప్పడంతో బాధితులు నమ్మి బ్యాంకు వివరాలు ఇస్తున్నారని అనంతరం వారించిన క్యూర్ కోడ్లు స్కాన్ చేయడం ద్వారా బ్యాంకుల్లో లక్షల రూపాయలు పొగొట్టుకుంటున్నారని అన్నారు.
ఈ సైబర్ నేరాల నేపథ్యంలోనే సైబరాబాద్‌లోని ప్రతీ పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ వింగ్ ప్రారంభించామని చెప్పారు.. సైబరాబాద్ పరిధిలో జూలై నెలలో 380 సైబర్ క్రైమ్ కేసులు నమోదు అయ్యాయి’ అని సీపీ సజ్జనార్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.