Home /News /telangana /

CYBER CRIMINALS STOLE RS 87000 FROM TEACHER ACCOUNT WITHIN HOURS OF COMPLAINING ABOUT THE CANCELLATION OF THE CREDIT CARD IN KAMAREDDY NZB PRV

Cyber crime: క్రెడిట్​ కార్డు క్యాన్సిల్​ చేయమంటే 87 వేలు కొట్టేశారు.. ఓ ఉపాధ్యాయురాలికి వింత అనుభవం

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఓ మ‌హిళా ఉపాధ్యాయురాలికి వెంట‌బడి క్రెడిట్​ కార్డు క‌ట్ట బెట్టారు. ఆయితే ఆ కార్డును రెండు సార్లు వాడుకుంది ఆమె. Interestఎక్కువ‌గా వేస్తున్నారని బ్యాంక్ కు వెళ్లి త‌న క్రెడిట్ కార్డు క్యాన్సల్ చేయాల‌ని కోరింది. కట్​ చేస్తే ఆమె ఎకౌంట్ ​నుంచి 87 వేలు మాయం అయ్యాయి.

ఇంకా చదవండి ...
    క్రెడిట్​ కార్డు (Credit Card) తీసుకోవడ‌మే కాదు.. వాడుకోవ‌డం కూడా తెలియాలి.. స‌రైన టైం కు చెల్లింపులు చేయ‌కపోతే ఆంతే న‌ష్టాన్ని చేస్తుంది. అయితే ఓ మ‌హిళా ఉపాధ్యాయురాలికి (Teacher)వెంట‌బడి క్రెడిట్​ కార్డు క‌ట్ట బెట్టారు. ఆయితే ఆ కార్డును రెండు సార్లు వాడుకుంది ఆమె. Interest ఎక్కువ‌గా వేస్తున్నారని బ్యాంక్ కు వెళ్లి త‌న క్రెడిట్ కార్డు క్యాన్సల్ చేయాల‌ని కోరింది. దీంతో  బ్యాంక్  సిబ్బంది ఆమె క్రెడిట్ కార్డ్  క్యాన్సల్ (To cancel credit card) చేస్తున్నట్టు ఉన్నతాధికారులకు ఈ మెయిల్ చేశారు. అయితే మీకు మ‌రుస‌టి రోజు ఫోన్​కాల్​ వ‌స్తుంది. మీరు వారికి స‌మాధానం చెప్పండి అన్నారు బ్యాంకు సిబ్బంది. అలాగే ఓ ఫోన్​ రావ‌డంతో త‌న వివ‌రాలు చెప్పింది. చివ‌ర‌కు త‌న బ్యాంక్ ఖాత నుంచి 87 వేల రూపాయ‌లు మాయమ‌య్యాయి. దీంతో పోలీసుల‌ను సదరు మహిళ ఆశ్ర‌యించింది. ఈ ఘ‌ట‌న కామారెడ్డి జిల్లాలో జ‌రిగింది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆమె వ‌ద్దు అని చెప్పినా..

    కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని  ప్ర‌భుత్వ ఉర్దు మీడియం పాఠశాల‌లో విధులు నిర్వ‌హిస్తున్న ఉపాధ్యాయురాలికి మూడు నెల‌ల క్రితం స్కూల్ కు వ‌చ్చి క్రెడిట్​ కార్డు తీసుకుకోండి అని ఓ వ్యక్తి  అడిగాడు. అయితే ఆమె వ‌ద్దు అని చెప్పినా విన‌కుండా ఆమెకు క్రెడిట్ కార్డు ఇచ్చారు.  అయితే ఆ కార్డును రెండు సార్లు వాడుకున్నారు ఆమె.. అనంతరం క్రెడిట్​ కార్డు డ‌బ్బులు క‌ట్ట‌డం క‌ష్టంగా ఉంద‌ని  ఆ కార్డును క్యాన్స‌ల్ చేయాల‌ని బ్యాంక్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయితే పై అధికారుల‌కు ఈ మెయిల్​ చేశాం.. మీకు కాల్ వ‌స్తుంది.. మాట్లాడండి అని చెప్పారు.



    ఎనిడెస్క్ యాప్​ను..

    దీంతో సదరు మహిళకు 15న‌ ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది.  మీరు మీ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేసుకుంటున్నారా.. ? అయితే మీ పూర్తి వివరాలు తెలియజేయాలని కోరారు. ఆమెను ఎనిడెస్క్ యాప్​ను ఇన్​స్టాల్​ చేయమ‌న్నారు.  ఆ యాప్​ను ఇన్ స్టాల్ చేయాగానే ఆమె అకౌంట్లో నుంచి రూ.87,753 క‌ట్ అయ్యాయి. దీంతో వెంటనే ఆ మహిళ కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ CI  కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

    స్పందించిన సీఐ  సైబర్ క్రైమ్ 1930 ద్వారా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు..          మూడు నెలల క్రితం క్రెడిట్ కార్డు కావాలని మా స్కూల్ కి వచ్చార‌ని బాధిత మ‌హిళా టీచ‌ర్ చెబుతున్నారు. మాకు వద్దు అన్నాగాని వారం రోజులు తిరిగి క్రెడిట్ కార్డు ఇచ్చి వెళ్లారని తెలిపింది.  అయితే ఆ కార్డును మూడు నెలల్లో రెండు సార్లు మాత్రమే ట్రాన్సాక్షన్ చేశానని చెప్పింది.. మొదటిసారి వాడిన డబ్బులు బ్యాంక్కి వెళ్లి కట్టేశాను..  ఆటో క్రెడిట్ పెట్టమని కూడా చెప్పాను. అయితే వారు పెట్టలేదు.  ఆ కార్డు భారత్ పెట్రోల్ సంబంధించిన కార్డు అని తెలిసిందని అన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Credit cards, Cyber crimes, Kamareddy, Nizamabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు