హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mail scam: వీళ్లు మామూలోల్లు కాదు.. ఒక్క ఈ-మెయిల్​తో 2 కోట్లు కొట్టేశారు..

Mail scam: వీళ్లు మామూలోల్లు కాదు.. ఒక్క ఈ-మెయిల్​తో 2 కోట్లు కొట్టేశారు..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

అమాయకుల అకౌంట్స్ గుల్ల చేస్తోన్న సైబర్​ నేరస్తులు.. ఎప్పుడూ చిన్న చేప‌లనే ఎందుకు అనుకున్నారో ఏమో.. ఏకంగా న‌గ‌ర కేంద్రంగా న‌డుస్తున్న ఒక పెద్ద ఎంఎన్​సీ కంపెనీకే బురిడి కొట్టించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  హైదరాబాద్ (Hyderabad)​ న‌గ‌రంలో గ‌త కొద్ది రోజులుగా సైబ‌ర్ నేర‌గాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఇప్ప‌టికే వివిధ మార్గాల ద్వార బాధితుల అకౌంట్స్ గుల్ల చేస్తున్న ఈ నేర‌గాళ్లు ఎప్పుడూ చిన్న చేప‌లనే ఎందుకు అనుకున్నారో ఏమో.. ఏకంగా న‌గ‌ర కేంద్రంగా న‌డుస్తోన్న ఒక పెద్ద ఎమ్ ఎన్ సీ కంపెనీకే బురిడి కొట్టించారు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకాంగా రూ. 2 కోట్ల పైనే త‌మ అకౌంట్స్ కు న‌గ‌దు బ‌దిలీ చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఏరోస్పేస్ MNC త‌న క్లైయింట్ కు చెల్లించాల్సిన రూ. 2 కోట్ల ప్రాజెక్ట్ మ‌నీని దారి మ‌ళ్లించి త‌మ‌ ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్ కి వెళ్లేలా చేసుకున్నారు.  ఏరోస్పేస్ MNC కంపెనీ విదేశీ తయారీ యూనిట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్ట్ నిమిత్తం త‌మ‌ ప్రాజెక్ట్ ఇచ్చిన సంస్థ‌తో "tfcmfg.com" డొమైన్ తో ఇ మెయిల్‌ (Email)ల ద్వారా సంప్రదింపులు జ‌రుపుతూ వ‌స్తోంది. అయితే స‌రిగ్గా ఇదే డొమైన్ ను కాస్త మార్చి విదేశి సంస్థ కు ఎమ్ ఎన్ సీ కంపెనీ చెల్లించాల్సిన‌ ప్రాజెక్ట్ డ‌బ్బును త‌మ ఖాతాల‌కు మ‌ళ్లించుకున్నారు సైబ‌ర్ నేర‌గాళ్లు.  సంస్థ మేనేజర్​ ఈ మేర‌కు సైబ‌ర్ క్రైమ్ అధికారుల‌కు పిర్యాధు చేశారు.


  డొమైన్ పేర్లలో పెద్ద‌గా తేడా లేక‌పోవ‌డంతో..


  గత నెల‌ జూన్ 11 కొంతమంది సైబ‌ర్ మోసగాళ్ళు "tfcmfq.com అనే డొమైన్‌తో నగర సంస్థకు అనేక ఈ మెయిల్‌లను పంపారు. ఇది ఒరిజినల్ డొమైన్‌లా క‌నిపించినప్ప‌టికి ఒక అక్షరం మాత్రం ఇందులో మార్చారు దీంతో పెద్ద‌గా ఎవ‌రికి అనుమానం కూడా రాదు..డొమైన్ పేర్లలో పెద్ద‌గా తేడా లేక‌పోవ‌డంతో, MNC ఉద్యోగులు వేరే ఖాతా నుంచి ఈ మెయిల్‌లు వ‌స్తున్నాయని గుర్తించలేకపోయారు. ప్రాజెక్ట్ కోసం చెల్లించాల్సిన డ‌బ్బును వేరే ఖాతాల‌కు పంపించాల‌ని ఆ ఖాతాకు సంబంధించిన వివ‌రాలు మరొక మొయిల్ లో పంపిస్తామ‌ని తెలిపారు. దీంతో హైదరాబాద్ MNC ఉద్యోగులకు వేర్వేరు ఖాతా వివ‌రాలు ఇచ్చారు.ఈ ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని అడిగారు.


  OMG: పాలమూరులో మానవమృగం.. అభాగ్యురాలిని నిర్భంధించి మూడు నెలలుగా అత్యాచారం..


  కంపెనీ ప్రతినిధులు సైబ‌ర్ నేర‌గాళ్లు అందించిన బ్యాంకు ఖాతాలకు US$ 289,721.97 (సుమారు 2.30 కోట్లు) బదిలీ చేశారు. ఆ తర్వాత, నకిలీ డొమైన్ ద్వారా అదే మోసగాళ్ల నుంచి తమకు మెయిల్స్ కూడా వచ్చినట్లు విదేశి కంపెనీకి కూడా తెలియ‌డంతో న‌గ‌ర కేంద్రంగా ఉన్న సంస్థ మోస‌పోయామ‌ని గ్రహించి రాచకొండ పోలీసులు పిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఐపీసీ, ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంస్థ ఖాతా నుంచి చెల్లింపు గేట్‌వే ద్వారా ఓవర్సీస్ బ్యాంకులకు మొత్తం ప్రాసెస్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CYBER CRIME, E mails, Hyderabad

  ఉత్తమ కథలు