• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • CYBER CRIMINALS NEW PLANS TO GET MONEY USING WATSAPP INSTEAD OF FACEBOOK VRY

Cyber crime : వాట్సప్ డీపితో టెమ్టింగ్...సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్

Cyber crime : వాట్సప్ డీపితో టెమ్టింగ్...సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్

ప్రతీకాత్మక చిత్రం

Cyber crime : తాము కరోనా భారిన పడ్డామని.. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని మీకు మెసెజ్‌లు వస్తున్నాయా...? వాట్సప్ డీపీల్లో తమ బంధువులు, స్నేహితుల ఫోటోలు కనిపించడంతో వెంటనే చలించి సహయాం చేస్తున్నారా...? అయితే ఒక్కసారి ఆగండి..డీపీ మీ స్నేహితుడు, బంధువుదే అయినా..ఓ సారి నెంబర్ కూడ చెక్ చేసుకొండి..

  • Share this:
    సైబర్ నేరగాళ్లు కరోనా రోగులను కూడ వదలడం లేదు.రోగులు తాము బ్రతుకుపై పోరాటం చేస్తుంటే..మరోవైపు సైబర్ నేరగాళ్లు కనీసం కరుణ కూడ లేకుండా పంజా విసురుతున్నారు. తామకు డబ్బులే ప్రధానంగా వ్యవహరిస్తున్నారు. కాలానికి అణుగుణంగా రంగులు మారుస్తున్నారు. ఇన్నాళ్లు తాము కరోనా పేషంట్లమంటూ..డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని సోషల్ మీడియాలో ప్రచారం చేసి..ఆసుపత్రుల్లో బిల్లులు కట్టలేకపోతున్నామని సోషల్ మీడియా రిక్వెస్ట్‌లు పెట్టారు. ముఖ్యంగా ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుని అక్రమ దందాకు తెరలేపారు. ఫేస్‌బుక్ ద్వార రిక్వెస్ట్‌లు పెట్టి డబ్బులు దండుకున్నారు.

    అయితే కొద్ది రోజుల తర్వాత సైబర్ నేరగాళ్ల అక్రమ దందా మీడియాలో ప్రచారం కావడంతో అసలు విషయం ప్రజలకు తెలిసిపోయింది. దీంతో సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా ఫ్రెండ్స్ ఇబ్బందుల్లో ఉన్నారని, ఫేస్‌బుక్ నుండి వాట్సప్‌కు మారారు. ఏకంగా వాట్సప్‌లో కరోనా రోగుల డీపీలు పెట్టి రెక్వెస్ట్‌లు పెడుతున్నారు. తాము కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నామని, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని మెసెజ్‌లు పంపుతున్నారు. ఎదుటి వ్యక్తిని చలించేలా మెసెజ్‌లు పంపుతున్నారు. దీనికి తోడు ఫోన్ కూడ తన వద్ద లేదని చెబుతూ..మాయా చేస్తున్నారు..ముఖ్యంగా మహిళల ఫోటోలు పెట్టి మరి టెమ్ట్ చేస్తుండడంతో.. నిజమే అనుకుని వాట్సప్‌ డీపి, మెసెజ్‌లు చూసిన బంధువులు, స్నేహితులు వెంటనే డబ్బులు పుతున్నారు.

    అయితే ట్విస్ట్ ఇక్కడే ఉంది. వాట్సప్ డీపిలు చూసిన వెంటనే చలించి బంధువులు, స్నేహితులు చలించి డబ్బులు పంపుతున్నా...అవి మాత్రం సైబర్ నేరగాళ్ల అకౌంట్‌లకు చేరుతున్నాయి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు కరోనా భారిన పడిన వారి ఫోటోలు సేకరించి తమ నెంబర్లలో వాట్సప్ డీపీలు మోసం చేస్తున్నారు.. ఇలా కొద్ది మంది స్నేహితులకు డబ్బులు పంపి మోసపోయిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.

    హైదరాబాద్ సమీపంలోని మన్సూరాబాద్‌కు చెందిన బాధితురాలికి రెండు సార్లు డబ్బులు పంపిన ఓ స్నేహితుడు కొద్ది రోజుల తర్వాత ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆమెకు ఫోన్ చేశాడు. దీంతో స్నేహితురాలు తనకు అసలు కరోనా ఎక్కడిది అంటూ..ప్రశ్నించే సరికి డబ్బులు పంపిన స్నేహితుడు ఖంగుతిన్నాడు. జరిగిన విషయం పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే భాదితుల ఫోటోలు, వారికి ఎలా తెలుస్తున్నాయనే దానిపై పోలీసులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.
    Published by:yveerash yveerash
    First published: