Home /News /telangana /

CV ANAND CHARGE AS COMMISSIONER OF POLICE OF HYDERABAD VRY

CV Anand : నగరానికి నయా కొత్వాల్.. బాధ్యతలు స్వీకరించిన సీవీ అనంద్..!

cv anand

cv anand

CV Anand : హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఉన్న సీపీ అంజనీ కుమార్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు.

    హైదరాబాద్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీపీ అంజనీ కుమార్ నుంచి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. కాగా.. శనివారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. కాగ హైదరాబాద్‌ సీపీగా ఉన్న అంజనీ కుమార్‌కు ఏసీబీ చీఫ్‌ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే... ఇక అడిషనల్‌ సీపీ శిఖా గోయల్‌ ఏసీబీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సిద్దిపేట కమిషనర్‌ గా ఉన్న జోయల్‌ డేవిడ్‌ను హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని వెస్ట్‌ జోన్‌ డీసీపీగా ప్రభుత్వం నియమించింది.

    కొద్ది రోజుల క్రితం వరకు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆనంద్‌ను తిరిగి సొంత కేడర్‌కు పిలిపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత... కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లిన సీవీ ఆనంద్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చిన తర్వాతే వెనక్కి వచ్చారు. కాగా గతంలో ట్రాఫిక్‌ సీపీగా పని చేసిన సీవీ ఆనంద్‌కు హైదరాబాద్‌పై పూర్తి పట్టుంది. నగరంలో లేక్ పోలీస్‌ను ఆయనే ప్రారంభించారు.

    మరోవైపు ఏసీబీ డీజిగా  అంజనీకుమార్ బాద్యతతు స్వీకరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక హైదరాబాద్ కమిషనర్‌గా చేసిన పని సంతృప్తినిచ్చిందన్నారు. అన్ని వర్గాల నుంచి పూర్తిస్థాయి సహకారం ఉందని... తనతో పాటు కలిసి మూడు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు పనిచేసిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు తమ డిపార్ట్మెంట్ ఎంతో సహాయ సహకారాలతో ముందుకెళ్లిందని చెప్పారు. హైదరాబాదులో ఒక మంచి సంస్కృతి ఉందన్నారు. ఆ సంస్కృతిని ఇన్నాళ్ల పాటు కంటిన్యూ చేసినట్లు తెలిపారు. ఏసీబీ డీజీగా నియమించి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు. శాఖాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఏసీబీ డీజీ అంజనీకుమార్ పేర్కొన్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, Hyderabad police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు