వేతనాల్లో కోతలు విధించే జీఓ చట్ట విరుద్ధం.. వేతనాలిప్పించే బాధ్యత కాంగ్రెస్‌ది..

కేరళ హైకోర్టు గతంలో ఇదే అంశంపై తీర్పులు ఇచ్చిందని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా జీతాలు, పెన్షన్లు కాజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: June 1, 2020, 2:01 PM IST
వేతనాల్లో కోతలు విధించే జీఓ చట్ట విరుద్ధం.. వేతనాలిప్పించే బాధ్యత కాంగ్రెస్‌ది..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వేతనాల్లో కోతలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబరు 27 చట్ట విరుద్ధమని కాంగ్రెస్ నేత చల్లా వంశీచందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎపిడమిక్ డిసిసెస్ యాక్ట్ 1827 పరిధిలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లలో కోత విధించే హక్కు ప్రభుత్వానికి లేదని కోర్టు తీర్పులిచ్చాయని తెలిపారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 300ఏ ప్రకారం వేతనాలు, పెన్షన్లలో కోత విధించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని గుర్తు చేశారు. కేరళ హైకోర్టు గతంలో ఇదే అంశంపై తీర్పులు ఇచ్చిందని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా జీతాలు, పెన్షన్లు కాజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు జీతాలివ్వలేని ప్రభుత్వానికి పాలించే హక్కు లేదన్నారు. ఇది ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వమని, పాత జీతాల బకాయిలు చెల్లిస్తూ మే నెల నుంచి పూర్తి జీతాలు చెల్లించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు, పెన్షనర్లకు అండగా ఉంటుందని, న్యాయ పోరాటం చేసైనా ఉద్యోగులకు జీతాలిప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని వివరించారు.
Published by: Narsimha Badhini
First published: June 1, 2020, 2:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading