CUTTING NOTES BAGS BESIDE ROAD AT NIZAMABAD GETTING VIRAL VRY
Nizamabad : వామ్మో.. చెత్త కుప్పలో డబ్బు...! మూటలే కానీ.. అవి
cutting notes
Nizamabad : నోట్ల ముక్కల సంచులు జాతీయ రహాదారీపై దర్శనిచ్చాయి.. ఇలా ఆరు సంవత్సరాల్లో రెండు సార్లు కత్తిరించిన నోట్ల ముక్కలు కుప్పలుగా పడేశారు.. దీంతో ఆ సంఘటన వైరల్గా మారింది.
డబ్బు.. దీని చుట్టే ప్రపంచమంతా గిరగిరా తిరుగుతుంటుంది.. డబ్బు నోట్ల కట్టలను సంపాదించడమే ద్యేయంగా అనేక దందాలు, అక్రమాలు కొనసాగుతుంటాయి.. అయితే అలాంటీ డబ్బు కట్టలు ఎందుకు పనికి రాకుండా రోడ్ల పక్కన పడేసే పరిస్థితి కూడా కొంతమందికి వస్తుంటుంది.. లేక్కలేనంత డబ్బు వారి చేతిలో ఉండడంతో ఏం చేయాలతో తోచక, రోడ్ల వేంట పారబోసిన ఉదంతాలు ఎన్నో చూశాము.. కాని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లో మాత్రం అందుకు విరుద్దంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.. నోట్ల కట్టలకు బదులు నోట్ల ముక్కలు చిత్తు కాగితాల్లా ఎందుకు పనికి రాకుండా రోడ్ల మీద దర్శనమిస్తున్నాయి... ఒక రకంగా చెప్పాలంటే నోట్లను కట్టలను చెత్త కుప్పలుగా మార్చి రోడ్డు మీద పారబోసిన సంఘటన తాజాగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై కత్తిరిచ్చిన కరెన్సీ నోట్ల ముక్కల సంచులు పడి ఉన్నాయి.. ఈ నోట్ల చెత్త కుప్పలో కొత్తగా వచ్చిన 100, 500, 2000 నోట్లను ముక్కలుగా చేసి సంచుల్లో నింపారు. ఈ సంచులను ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్లే దారిలో వీటిని పడేశారు. అయితే ఈ సంచులపై నుండి హేవీ వెహికిల్స్ వెళ్లడంతో చెల్లా చెదురుగా రోడ్డుపై ఎగిరి పడ్డాయి.
విశేషమేమిటంటే ఇలాంటీ సంఘటనే ఇదే గ్రామం బుస్సాపూర్ జాతీయ రహదారి పక్కన ఆరేళ్ల కిందట కూడా ఇలాంటి నోట్ల ముక్కలే పడేశారు. అయితే ఇలా ఆరు సంవత్సరాల్లో ఒకే గ్రామంలో రెండు సార్లు కరెన్సీ నోట్ల ముక్కలు పడి ఉండటం అనుమానాలకు తావిస్తోంది.దీంతో కొంతమంది స్థానికులు ఈ నోట్ల ముక్కలు ఎక్కడికో రవాణా చేస్తుండగా వాహనంలో నుంచి పడి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రెగ్యులర్గా ఈ తంతు కొనసాగుతుందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.. కరెన్సీ ముక్కలను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారో తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..
ఇక నోట్ల చెత్తపై సమాచారం అందుకున్న స్థానిక ఏఎస్సై మురళీధర్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. వాటి శాంపిళ్లను సేకరించి, ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.