హోమ్ /వార్తలు /తెలంగాణ /

Corona Test : అక్కడ @1999 రూపాయలకే సిటీ స్కానింగ్ మంత్రి చొరవతో దిగివచ్చిన డయాగ్నోసిస్ సెంటర్స్

Corona Test : అక్కడ @1999 రూపాయలకే సిటీ స్కానింగ్ మంత్రి చొరవతో దిగివచ్చిన డయాగ్నోసిస్ సెంటర్స్

Corona Test : కరోనా నేపథ్యంలో పేద ప్రజలకు సహకరించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని ప్రైవేటు డియాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా కేవలం 1999 రూపాయలకు సిటి స్కాన్ చేసేందుకు ప్రైవేటు డియాగ్నోస్టిక్ కేంద్రాల అసోసియేషన్ అంగీకరించిందని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఇంకా చదవండి ...

  కరోనా నిర్ధారణ పరీక్షలు కాస్లీగా మారిన విషయం తెలిసిందే..ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత వేలాదిగా కరోనా భారిన పడుతుండడంతో చాలమంది సీటి స్కాన్ ద్వార కరోనా పరీక్ష చేయించకుంటున్నారు. దీంతో హఠాత్తుగా సీటీ స్కాన్ ధరలు పెరిగాయి.. దీంతో మహాబుబ్‌నగర్ జిల్లా డయాగ్నోసిస్ నిర్వాహకులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశం నిర్వహించారు.

  ఇక అవసరం ఉంటే తప్ప సిటీ స్కానింగ్ రాయకూడదని, పల్మనాలజిస్ట్ సూచన మేరకే సి టి స్కాన్ తీయాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ప్రైవేటు సిటీ స్కాన్ యజమానుల అసోసియేషన్ లతో మాట్లాడిన అనంతరం కేవలం 1999 రూపాయలకె సి టి స్కాన్ తీసేందుకు అంగీకరించారని వారందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోనే అతి తక్కువ ధరకు సి టి స్కాన్ సేవలు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు .ఈ నిర్ణయాన్ని కాదని ఎవరైనా ఎక్కువ ధరకు సీటీస్కాన్ చేసినట్లయితే సదరు డయాగ్నస్టిక్ సెంటర్ లను మూసివేస్తామని మంత్రి హెచ్చరించారు.

  సోమవారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా తీవ్ర ఉధృతిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో రేమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో పెడుతున్నామని, ధరల నియంత్రణ విషయమై డి ఎం హెచ్ ఓ ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్, ఆర్డివో,డి ఎస్ పి లతో టాస్క్ఫోర్స్ బృందం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులలో 20 శాతం బెడ్లు తప్పనిసరిగా పేదలకు కేటాయించాలని, ఒకవేళ ప్రైవేట్ ఆస్పత్రులు 20 శాతం కేటాయించకపోతే ప్రభుత్వమే వాటిని స్వాధీనం చేసుకుంటుందని, కేటాయించిన 20శాతం బెడ్ లకు ప్రత్యేక కలర్లతో మార్కింగ్ ఇవ్వాలని తెలిపారు.

  ప్రైవేట్ ఆస్పత్రులకు 450 రేమిడిసివిర్ ఇంజక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించామని,ఇంజెక్షన్లు ఎంఆర్పి ధరలకే విక్రయించాలని లేదంటే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ప్రైవేట్ ఆసుపత్రులు అవసరమైనవారికి మాత్రమే ఆక్సిజన్,రేమిడెసివిర్ ఇంజెక్షన్లను ఇవ్వాలని తెలిపారు. జిల్లాలో 13 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయని ,ఎవరైనా ఎమ్మార్పీ ధరలకు మించి అమ్మినట్లయితే ఆస్పత్రులను సీజ్ చేస్తామని మంత్రి హెచ్చరించారు.

  First published:

  Tags: Corona test, Mahabubnagar, Srinivas goud

  ఉత్తమ కథలు