తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం వ్యాక్సిన్ల సరఫరాను తగ్గించింది. తెలంగాణకు మే నెల కోసం లక్షల్లో వ్యాక్సిన్ అవసరం అని చెప్పినా 3.90 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే ఇచ్చిందన్నారు. దీని ప్రకారం చూసుకుంటే మే, జూన్ నెలలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో వ్యాక్సిన్ కంపెనీ ఉన్నా ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో కేంద్రం నియంత్రిస్తోందన్నారు. ఎక్కువగా వ్యాక్సిన్లు అవసరం అవుతాయని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ కూడా రాశారని.. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం కొరతను నియంత్రించేందుకు ఇతర దేశాలలో టీకా తయారీదారును కూడా సంప్రదించినట్లు సీఎస్ తెలిపారు. మే 1 నుంచి 18 మరియు 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి టీకాలు వేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేసుకోగా రాష్ట్రంలో 18–44 ఏళ్ల జనాభా 1.70 కోట్లు ఉండగా, 3.40 కోట్ల వ్యాక్సిన్లు కావాలి. అయితే స్టాక్స్ అందుబాటులో లేనందున 45 ఏళ్లుపైబడిన వారికి మాత్రమే టీకాలను వేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు.
అయితే 30 నుంచి 40 లక్షల వ్యాక్సిన్లు కావాలని కేంద్రాన్ని కోరాం. ఆ మేరకు వస్తేనే 18–44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ప్రారంభిస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు ,పీహెచ్సీలలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడిందిని .. జూన్, జూలై తర్వాత వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరిగే అవకాశం అందన్నారు. ఆలోగా జాన్సన్ అండ్ జాన్సన్ బయలాజికల్–ఇ వ్యాక్సిన్ కూడా వస్తుందని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఆస్పత్రికి వచ్చే అవసరమే రాదు. కరోనా లక్షణాలు కనిపించగానే విటమిన్ టాబ్లెట్లు, పారాసిట్మాల్ తీసుకోవాలని సూచించారు.
లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యం చేసిన వారే ఇబ్బంది పడుతున్నారు. సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి ఇబ్బందులు రావు అని సీఎస్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. లాక్డౌన్తో ఎలాంటి ఉపయోగం లేదని.. రాష్ట్రాలు లాక్డౌన్ విధించినా పెద్దగా తేడా రాలేదని సీఎస్ పేర్కొన్నారు. వారాంతపు లాక్ డౌన్ పై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid vaccine, COVID-19 vaccine, Cs somesh kumar, Hyderabad, Lock down, Review meeting on covid, Telangana