మరికాసేపట్లో ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక ప్రకటన

సమ్మె అంశాన్ని లేబర్‌ కోర్టుకు నివేదించడంతో ఇరకాటంలో పడిన కార్మిక సంఘాల నేతలు.. సమ్మె కొనసాగింపుపై పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 19, 2019, 3:49 PM IST
మరికాసేపట్లో ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక ప్రకటన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర తర్జనభర్జనకు లోనవుతున్నాయి. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించడం.. సమ్మె అంశాన్ని లేబర్‌ కోర్టుకు నివేదించడంతో ఇరకాటంలోపడిన కార్మిక సంఘాల నేతలు.. సమ్మె కొనసాగింపుపై పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 46 రోజులుగా కొనసాగిస్తున్న ఆర్టీసీ సమ్మెను విరమించే అవకాశముందని సమాచారం. ఒకవేళ సమ్మె విరమించినా కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం నిరాకరిస్తే.. ఏం చేయాలనే దానిపైనా కార్మిక సంఘాల నేతలు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఈ అంశంపై టీఎంయూ, ఈయూ కార్మిక సంఘాల నేతలలు విడివిడిగా సమావేశమై దీనిపై ఈ చర్చల్లో మొత్తం 97 డిపోల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు.

Published by: Kishore Akkaladevi
First published: November 19, 2019, 3:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading