హోమ్ /వార్తలు /తెలంగాణ /

Khammam mlc Review : ఖమ్మంలో క్రాస్‌ ఓటింగ్‌.. గట్టెక్కిన తెరాస.. క్రాస్‌ ఓటింగ్‌పై సీఎం కేసీఆర్‌ ఆరా..

Khammam mlc Review : ఖమ్మంలో క్రాస్‌ ఓటింగ్‌.. గట్టెక్కిన తెరాస.. క్రాస్‌ ఓటింగ్‌పై సీఎం కేసీఆర్‌ ఆరా..

ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి మధుసూదన్

ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి మధుసూదన్

Khammam mlc Review : ఖమ్మంలో టీఆర్ఎస్‌లో అంతర్గత పోరు మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బయటపడ్డాయి. ఆ పార్టీకి చెందిన మొత్తం ఓట్ల కంటే తక్కువగా వచ్చాయి.. అయితే ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

ఇంకా చదవండి ...

  జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా

  ఖమ్మం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని తెరాస కైవసం చేసుకుంది. ఎన్నారైగా, తానా కార్యదర్శిగా రెండు పర్యాయాలు పనిచేసిన తాతా మధుసూదన్‌ విజయం సాధించారు. ( Cross voting in khammam mlc elections ) ప్రస్తుతం ఆయన తెరాస రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. సామాజికవర్గ సమీకరణలు, తెరాస ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర కన్వీనర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో ఉన్న చిన్ననాటి ఉద్యమ స్నేహితం మధుసూదన్‌కు కలిసొచ్చాయి. అనూహ్యంగా ఆయన అభ్యర్థిత్వం తెరపైకి రావడంతో తెరాసలోని జిల్లాకు చెందిన ముఖ్య నాయకత్వం కొద్దిపాటి ఆశ్చర్యానికి లోనైనా, అధినేత నిర్ణయం కనుక క్రమశిక్షణతోనే పనిచేసినట్టు చెబుతున్నారు.

  వాస్తవానికి టికెట్‌ ప్రకటించిన రోజే ఎమ్మెల్సీ అయినట్టు లెక్క అన్నంత.. సరిపడినంత బలం, బలగం, అధికారం, వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎక్కడో ఒక అలజడి అందరిలోనూ నెలకొంది.( Cross voting in khammam mlc elections ) అయినప్పటికీ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నేతృత్వంలో మంచి మెజారిటీతోనే విజయం సాధించినట్టు భావించాలి. మధుసూదన్‌ తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై 238 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇది సహజంగానే తెరాసలో ఉత్సాహాన్ని నింపింది. విజయం ఖాయం అయిన మరుక్షణం సంబరాలు మిన్నంటాయి. తెరాస జిల్లా కార్యాయలంలో కార్యకర్తల నడుమ నేతలంతా తమ సంతోషాన్ని పంచుకున్నారు.

  MLC elections :ఎమ్మెల్సీ ఎన్నికల్లో సవాళ్లను నిలబెట్టుకున్న ఆ... నేతలు.. ?


  క్రాస్‌ ఓటింగ్‌ సంగతేంటి..? సీఎం కేసీఆర్‌ ఆరా..

  తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు వేరు. ఖమ్మం జిల్లా కథ వేరు. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ సంక్లిష్టంగా, వైవిధ్యంగా ఉంటాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. నిజానికి తెరాసకు విజయం నల్లేరు పైన నడకలాంటిది కావాల్సి ఉంది. కానీ సొంత పార్టీ ఓటర్ల నుంచి మద్దతు పొందడానికి కూడా నేతలు ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఎక్కడో సుదూర ప్రాంతమైన గోవాలో క్యాంపులు నిర్వహించి, భారీగా వనరులు వ్యయం చేసి మరీ వారి ఓట్లను పొందాల్సి వచ్చింది. తెరాస జిల్లా నేతలు ముందునుంచి ఊహించిందే జరిగింది. ( Cross voting in khammam mlc elections ) ఖమ్మం జిల్లా తెరాస నాయకత్వం భయపడినంతా అయింది. భారీగా వ్యయం చేసి క్యాంపులు నిర్వహించినప్పటకీ.. మంచి మెజారిటీతోనే విజయం సాధించినప్పటికీ.. ఇంకా ఎక్కడో కలుక్కుమంటున్న పరిస్థితి. తెలీని ముల్లు గుచ్చుకుంటున్నట్టు.. సీఎం కేసీఆర్‌ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమీక్ష సందర్భంలో అన్నట్టు తమ కత్తులే తమకు గుచ్చుకుని గాయాలపాలైనట్టు.. ప్రతిసారీ ఇలా ఎందుకు అంటే సమాధానం లేదు.

  Breaking : ఇప్పుడు ఓకే... గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనా చారి..


  తెరాసకు దక్కని 100శాతం మద్దతు

  ఈ ఎన్నికల్లో కూడా తెరాసకు చెందిన మొత్తం ఓట్లు సొంత అభ్యర్థికి దక్కలేదు. తెరాస కోణంలో చూస్తే..  పార్టీకి ఉన్న సొంత ఓట్లు 497. కాంగ్రెస్‌ నుంచి వచ్చి చేరిన వాళ్లు 18. అంటే మొత్తం 515. ఇవి కాకుండా సీపీఐ బలపర్చడం ద్వారా వచ్చిన ఓట్లు 34. వెరసి తెరాసకు దక్కాల్సినవి 549. ( Cross voting in khammam mlc elections ) ఇవి కాకుండా ఎన్నికలకు దూరంగా ఉండాలని సీపీఎం నిర్ణయం తీసుకున్నప్పటివకీ తాతా మధుసూదన్‌తో ఉన్న అనుబంధం రీత్యా కొందరు వచ్చి ఓట్లు వేసినట్టు చెబుతున్నారు. ఇంత చేసినా తెరాస అభ్యర్థికి వచ్చిన ఓట్లు 480. అంటే 70 ఓట్లకు పైగా ఓట్లు పడలేదు అని చెప్పుకోవచ్చు.

  కాంగ్రెస్‌కు అదనంగా 144 ఓట్లు..

  అయితే ఇదే సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు సాధించిన ఓట్లు 242. నిజానికి కాంగ్రెస్‌కు ఉన్న ఓట్లు 116. వీటిలో 18 మంది గతంలోనే తెరాసలో చేరగా మిగిలినవి 98 మాత్రమే. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి పడిన ఓట్లు 242. అంటే కాంగ్రెస్‌కు 144 ఓట్లు అదనంగా వచ్చినట్టు లెక్క. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినట్టు..?

  ఇది తేలాలి.

  దీనిపై ఇప్పటికే తెరాస అధినేతకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భారీ క్రాస్‌ ఓటింగ్‌పై సీఎం కేసీఆర్‌ ఆరా తీసినట్టు సమాచారం. విజయం సాధించడం పట్ల సంతోషంగానే ఉన్నప్పటికీ, ఎక్కడికక్కడ జరుగుతున్న నష్టం ఎందుకు..? ఎలా..? ఎవరి వల్ల అన్నది తేలాలన్నది అందరిలోనూ ఉన్న ఆలోచన.( Cross voting in khammam mlc elections ) దీనిపై నేతలు ఒకరి వైపు మరొకరు వేళ్లు చూపుకోవడం పట్ల కార్యకర్తల్లో అసహనం నెలకొంటోంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో మరింత నష్టాలను చవిచూడాల్సి వస్తుందన్న భయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Khammam, Mlc elections, Telangana

  ఉత్తమ కథలు