హోమ్ /వార్తలు /తెలంగాణ /

Traffic fines : కాసులు కురిపిస్తున్న కెమెరా కళ్లు.. జరిమానాలు చూస్తే...షాక్ అవ్వాల్సిందే..మరి..!

Traffic fines : కాసులు కురిపిస్తున్న కెమెరా కళ్లు.. జరిమానాలు చూస్తే...షాక్ అవ్వాల్సిందే..మరి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Traffic fines : నగరంలో నేరాల అదుపుకు బిగించిన కెమెరాలు ట్రాఫిక్ పోలీసులకు కాసులు కురిపిస్తున్నాయి..టూవీలర్స్‌పై వెళ్లేవారికి చుక్కలు చూపిస్తూ..కోట్ల రూపాయలు అర్జించి పెడుతున్నాయి..రక్షణ కోసమంటూ ఏర్పాటు చేస్తున్న కెమెరా కళ్లు..ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారిని మాత్రం ఆర్థికంగా కొల్లగొడుతున్నాయి...

ఇంకా చదవండి ...

నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించిన వారి నుండి పోలీసులు కోట్లలో రూపాయలు వసూలు చేశారు. గత కొద్దిరోజులుగా కరోనా నిబంధనలతో వాహానదారులు బయటకు రాకున్నా...గత ఆరునెలల్లో మాత్రం ట్రాఫిక్ పోలీసులు వేసిన జరిమానాలు చూస్తే కళ్లు తిరగక మానదు.. ఈ నేపథ్యంలనే వాహానదారులనుండి సైబరాబాద్, హైదరాబాద్‌ తో పాటు రాచకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 87 కోట్ల రూపాయలను జరిమానాలుగా విధించారు.

ముఖ్యంగా ఈ జరిమానాల్లో  హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారు ఎక్కువగా ఉన్నారు. రోడ్డుమీదకు హెల్మెట్ లేకుండా వస్లే కెమెరా కంటపడుతున్నారు. ఒకవేళ కెమెరాలకు చిక్కని వారు ట్రాఫిక్ కానిస్టేబుల్ కెమెరాలు క్లిక్‌ మనిపిస్తున్నారు. దీంతో వాహానదారులు నిబంధనలు పాటించకుండా వస్తే ఎట్టిపరిస్థితుల్లో ఏదో ఒక కెమేరాకు చిక్కాల్సి వస్తుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారిని పట్టుకునేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌కు కూడా ఆయా కమిషనరేట్‌లు టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇలా ఒక్కో కానిస్టేబుల్ కనీసం 200 ఫోటోలు తీసేవిధంగా టార్గెట్ ఫిక్స్ చేయడంతో అటు కానిస్టేబుల్స్ కూడా హెల్మెట్ పెట్టుకోని వాహానదారులు ఎవరు దొరుకుతారా అనే కోణంలో వేచి చూస్తున్నారు.ఇలాంటీ పరిణామాల నేపథ్యంలో లాక్‌డౌన్ పరిస్థితులు ఉన్న కూడా.. ఆరునెలల్లో సుమారు 87 కోట్ల రూపాయల వరకు జరిమానాలు విధించారంటే ఏమేరకు పోలీసులు టార్గెట్ విధించారో అర్థం చేసుకోవచ్చు.. దీంతో ట్రాఫిక్ నిబంధనల పేరుమీద ప్రభుత్వం కోట్ల రూపాయలను దండుకుంటుందనే విమర్శలు ప్రజల నుండి వెల్లువెత్తున్నాయి..

ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ట్రాఫిక్ పోలీసులు వాహానాదారులపై ఫైన్ వేయడం కంటే ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న చాలాన్ల వసూలుకు ఎక్కువగా శ్రద్ద చూపిస్తున్నారు. టూ వీలర్ ఆపారంటే చాలు..పాత జరిమానాలు ఎన్ని ఉన్నాయో లేక్క తీస్తున్నారు. ఆ జరిమానాలు కట్టిన తర్వాతే తిరిగి బండిని ఇస్తున్నారు. లేదంటే టూ వీలర్‌ను సీజ్ చేస్తున్నారు..ఇలా బలవంతంగా  పెండింగ్ బకాయిల వసూళ్లకు పాల్పడుతుండడం ద్వారా  ఇప్పటివరకు   45 శాతం మేర వపెండింగ్ చాలన్లు వసూలు చేసినట్టు సమాచారం.

మొత్తం మీద హెల్మెట్ లేకుండా నగరంలో కొద్ది మృత్యువాత పడడాన్ని బూచిగా చూపి కష్టకాలంలో కూడా వాహానదారులనపై అదనపు భారం వేస్తున్నారు. ఓవైపు పెట్రోల్ ధరలు మరోవైపు పోలీసుల ట్రాఫిక్ నిబంధనలు నగర వాహనా దారులకు చుక్కలు చూపిస్తున్నాయనే విమర్శలు తలెత్తున్నాయి.

First published:

Tags: Hyderabad Traffic Police, Traffic penalty

ఉత్తమ కథలు