బ్యాంకులు ఎప్పుడూ ఖాతాదారుల నుంచి వడ్డీలు, సర్వీసు ఛార్జీలు(Service charges), మినిమమ్ ఛార్జీలు(Minimum charges)వసూలు చేయడమే తప్ప ఎదురు డబ్బులు ఖాతాలో జమ చేయవు. కాని తెలంగాణ(Telangana)లో మాత్రం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(HDFC Bank) కస్టమర్లకు కనకవర్షం కురుస్తోంది. వద్దంటే డబ్బులు బ్యాంక్ అకౌంట్(Account)లో పడుతున్నాయి. ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు జరపకుండానే తమ అకౌంట్‌లో కోట్లు, లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్(Transfer)కావడంతో కస్టమర్లు షాక్ అవుతున్నారు. ఇదేంటి ఇంత డబ్బులు ఎలా వచ్చింది..? ఎవరు తమకు ట్రాన్స్‌ఫర్ చేశారని అవక్కైపోతున్నారు. పెద్దపల్లి(Peddapalli)జిల్లా మంథని(Manthani)పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది. టౌన్‌లో మొబైల్ షాప్ నిర్వహిస్తున్న ఇల్లెందుల సాయి (Illendula Sai)అనే యువకుడికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్ ఉంది. అందులో ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల(5crore 68 lakhs) రూపాయలు జమా అయ్యాయి.
నిమిషంలోనే కోటీశ్వరులు..
సాయి ఫోన్‌కి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు జమా అయినట్లుగా మెసేజ్ వచ్చింది. వెంటనే షాక్ అయ్యాడు. అంత డబ్బు ఏం చేయాలో ? ఎవరు తనకు ట్రాన్స్‌ఫర్ చేశారో అర్ధం కాలేదు. వచ్చిన డబ్బును ఏం చేయాలి...ఎవరికి చెప్పాలని ఆలోచిస్తుండగానే ఖాతాలో జమ అయిన ఐదు కోట్ల 68లక్షల రూపాయలు మాయమైపోయాయి. ఎందుకిలా జరిగిందని సాయి బ్యాంక్ అధికారుల్ని అడగడంతో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే నగదు జమ అయినట్లు చెప్పారు.
మళ్లీ గంటల్లోనే డబ్బు మాయం..
అటు వికారాబాద్ జిల్లాకు చెందిన మరో వ్యక్తికి కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్ ఉంది. అతనికి కూడా 18.52కోట్ల రూపాయలు జమ అయ్యాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే డబ్బు అంతా మాయమైపోయింది. అతను కూడా బ్యాంక్ అధికారులను సంప్రదించడంతో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లే ఇలా జరిగిందని..ఏం కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. తెలంగాణలోనే కాదు తమిళనాడులో కూడా ఇదే తరహాలో హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన వందలాది మంది ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్‌లలోకి డబ్బులు జమా అయ్యాయి. కస్టమర్లు ఖంగుతిని కోలుకునే లోపే జమ అయిన డబ్బు మాయమైపోయింది.
అసలు ఏం జరుగుతోంది..?
చెన్నైలోని టి.నగర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాదారులకు ఒక్కసారిగా అకౌంట్లో కోట్లాది రూపాయలు డిపాజిట్ అయ్యాయి. వారి ప్రమేయం లేకుండానే, అడక్కుండానే పెద్ద మొత్తంలో డబ్బు పడింది. తమ ఖాతాలకు రూ.13 కోట్ల మేర నగదు జమ అయినట్టు ఎస్‌ఎంఎస్‌లు అందుకున్న కస్టమర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. జమ అయిన డబ్బులో కొందరు ఆన్‌లైన్ ట్రాన్సఫర్ చేసుకుంటే మరికొందరు ఏటీఎంలకు వెళ్లి కొంత విత్ డ్రా చేసుకున్నారు. కొందరి ద్వారా బ్యాంక్ అధికారులు విషయం తెలుసుకొని ఆయా అకౌంట్‌ల లావాదేవీలు ఫ్రీజ్ చేశారు. సాంకేతిక లోపం వల్ల బదిలీ జరిగిందా? లేక ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సర్వీస్‌ని సైబర్ నేరగాళ్లు హ్యక్ చేశారా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: HDFC bank, Peddapalli, Telangana