Home /News /telangana /

CROPS DAMAGED BY MONKEYS IN ERSTWHILE ADILABAD DISTRICT VRY ADB

Adilabad : అడవి మంత్రి జిల్లాలోనే వానరాల హల్‌చల్.. పట్టిస్తే..రూ.500 ..

ఇంటిపై వానరాల హల్‌చల్

ఇంటిపై వానరాల హల్‌చల్

Adilabad : స్వయాన అడవి మంత్రి ఉన్న ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో వానరాలు హంగామా సృష్టిస్తున్నాయి.పంటల నాశనంతో పాటు దారి వెంటవచ్చిపోయో వారిని సైతం తరుముతున్నాయి.

    ( ఆదిలాబాద్ కట్టా లెనిన్, న్యూస్ 18 )

    అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్ జిల్లాలోని వనాల్లో తిరిగే కోతులు ఊళ్ళ బాటపడుతున్నాయి. ఇప్పటికే అటవీ ప్రాంతం గుండా వెళ్ళే రోడ్లకు ఇరువైపులా నిలబడి వచ్చి పోయే వాహనదారులు, ఇతర ప్రయాణికులు అందించే తినుబండారాల కోసం  ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ నుండి నిర్మల్ వైపు వెళ్ళే ప్రధాన రహదారిపై మహెబూబ్ ఘాట్ పై, ఇటు ఆదిలాబాద్ నుండి మంచిర్యాల వైపు వెళ్ళే మార్గంలో ఉట్నూరు, ఇందన్ పల్లి, జన్నారం అటవీ ప్రాంతాల్లో రహదారిపైకి కోతులు వస్తూ విన్యాసాలు చేస్తుంటాయి.  అలాగే ఆదిలాబాద్ నుండి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వైపు వెళ్ళే మార్గంలో కెరమెరి ఘాట్స్ పై కోతులు సందడి చేస్తుంటాయి.

    మరికొన్ని కోతులు గుంపులు గుంపులు గా గ్రామాల్లోకి వెళ్ళి అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇళ్లు పీకి పందిరేసినంత పని చేస్తున్నాయి. ఒకవైపు ఇండ్లపైకి చేరి చేతిలో వస్తులను లాక్కెల్లడమే కాకుండా ఎవరు లేనిది చూసి ఇళ్లలోకి చొరబడి వండుకుని పెట్టుకున్న వంటలను, వస్తువులను చిందరవందర చేస్తూ కోతి చేష్టలను ప్రత్యక్ష్యంగా చూపిస్తున్నాయి. అంతటితో ఆగిపోకుండా పంటచేలపైపడి మొక్కజొన్న, జొన్న తదితర పంటలను నాశనం చేస్తున్నాయి.

    Hyderabad : సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని తొలగించిన మున్సిపల్ అధికారులు.. ఉదయం వెలిసింది.. సాయంత్రం..

    దీంతో జిల్లాలోని నేరడిగొండ మండలం కుమారి గ్రామంలో కోతుల చేష్టలకు గ్రామస్థులు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ఊళ్లో జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కోతులను పట్టి అటవుల్లో వదిలిపెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం గ్రామస్థులు చందాలు పోగు చేసి కోతులు పట్టేవారిని ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు తదితర ప్రాంతాల నుండి కోతులను పట్టే వారిని పిలిపించుకున్నారు. సుమారు లక్షా 30 వేల రూపాయల తో కోతులను పట్టిస్తున్నారు. కొంత నగదును గ్రామస్థులు చందాల ద్వారా పోగు చేయగా, మరికొంత డబ్బులను గ్రామాభివృద్ది కమిటి నుండి సమకూర్చాలని నిర్ణయించారు. ఒక్కో కోతిని పట్టేందుకు 500 రూపాయల వరకు చెల్లిస్తున్నారు.

    CV Anand : డ్రగ్స్‌పై రూటు మార్చిన పోలీసులు.. వినియోగదారుల అరెస్ట్..!

    ఇక కోతులు పట్టేవారు గ్రామంలో, పంటచేల వద్ద మంకీ బోన్లను ఏర్పాటు చేశారు. అలా పట్టుకున్న కోతులను తీసుకువెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెడుతున్నారు. గతంలో కూడా ఇలాగే పలు మార్లు ఆదిలాబాద్ జిల్లాలో కోతులను పట్టుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెడుతున్నారు. అయినా కోతులు గ్రామాలవైపు వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సంబంధిత శాఖ అధికారులను పురమాయించి కోతుల బెడదను నివారించడానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Monkeys, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు