CRICKET TOURNAMENT STARTS AT OR ON OCCASION OF CM KCR BIRTHDAY VRY
Osmania university : ఓయూలో కొనసాగుతున్న క్రికెట్ టోర్నీ.. ఉదయం ఉద్రిక్తత .. ఆ తర్వాతే..
ఓయూలో క్రికెట్ పోటీలు
Osmania university : ఆందోళనల మధ్య ఓయూలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి.. ఉదయం టీఆర్ఎస్ విద్యార్థి విభాగం సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని క్రికెట్ పోటీలు ప్రారంభించారు. అయితే ఉదయం కొంతమంది విద్యార్థులు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే..
ఎట్టకేలకు ఓయూ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం చేపట్టిన క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు (CM KCR birthday). ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ (TRSV) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవాలకు ప్రభుత్వ విప్ అచ్చం పేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ఇతర కార్పోరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఓయూ కేంద్రంగా నిర్వహించిన పలు ఉద్యమ సంధర్బాలను నేతలు గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని పలువురు నేతలు కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ప్రతి ఒక్కరికీ తోడుగా సీఎం నిలుస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ లు బాలరాజు యాదవ్, జగన్మోహన్ రావ్,గజ్జెల నగేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పిడమర్తి రవితో పాటు పలువురు విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు.
కాగా క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవానికి ముందే అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంపస్లో టీఆర్ఎస్ పార్టీ (TRS Party)కి చెందిన ప్లెక్సీలు రాత్రికి రాత్రే దర్శనమివ్వడంతో ఈ ఉద్రిక్తతకు చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు ప్లెక్సీలను చించివేసి ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ ప్లెక్సీలకే కాదు ఆ పార్టీ నాయకులు క్యాంపస్ లో అడుగుపెట్టినా ఇదే గతి పడుతుందని నిరుద్యోగ యువత హెచ్చరించారు.నోటిఫికేషన్లు వేసిన తర్వాతే టీఆర్ఎస్ నేతలు ఓయూలో అడుగుపెట్టాలని హెచ్చరించారు. ఓ విద్యార్థి పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసులు మాత్రం ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని పరిస్థితి చక్కదిద్దారు. ఆ తర్వాత క్రికెట్ టోర్నమెంట్ సాఫిగా కొనసాగాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.