సీఏఏపై సీఎం కేసీఆర్ వైఖరిని స్వాగతిస్తున్నాం...సిపిఐ జాతీయ కార్యదర్శ డి. రాజా వెల్లడి...

కేసీఆర్ caa కు వ్యతిరేకంగా తీర్మానం మార్చిలో చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నమని, తెలంగాణరాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదుల ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమలను,ర్యాలీలు,సభలను చేపడితే అడ్డుకోవడం, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

news18-telugu
Updated: February 22, 2020, 10:16 PM IST
సీఏఏపై సీఎం కేసీఆర్ వైఖరిని స్వాగతిస్తున్నాం...సిపిఐ జాతీయ కార్యదర్శ డి. రాజా వెల్లడి...
డి. రాజా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి
  • Share this:
దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని సబ్ కా సత్ సబ్ కా వికాస్, అని చెప్పి మోడీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశాడని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి D రాజా పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ (CPI) రాష్ట్ర నిర్మాణ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా అరుణ పతాకం ఆవిష్కరించి , అక్కడ ఏర్పాటు అమరవీరుల స్థూపానికి శ్రద్ధాంజలి ఘటించారు. మోడీ ప్రభుత్వం ప్రజాధనం కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నాడని, ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలైన బొగ్గు పరిశ్రమలను ప్రైవేటు పరం చేస్తున్నాడని ఆరోపించారు. రెండోసారి ప్రధాని అయిన మోడీ,హోంమంత్రి అమిద్ షా లు ప్రజాస్వామ్యని ఖుని చేస్తున్నారని, సంఘ్ పరివార్ భావజాలంతో హిందూత్వ ఏజెండాతో ముందుకు పోతున్నారని అన్నారు. ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా అర్బన్ మావోయిస్టులు గా ముద్ర వేస్తూ అక్రమ అరెస్టులను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ విధానాలతో శ్రీనగర్,కాశ్మీర్ లో 370 యాక్ట్ రద్దు చేయడం మూలంగా ప్రజలు నష్టపోతున్నారని , ప్రశ్నించేవారిని అణిచివేయడం చట్ట విరుద్ధమని అన్నారు . అయోధ్యలో రామమందిరాన్ని ప్రభుత్వం నిర్మిచడం రాజ్యాంగ విరుద్ధమని , బిజెపి Nrc, caa,npr చట్టాలను తీసుకు వచ్చి RSS ఏజెండా తో ముందుకు పోతుందని అన్నారు.ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ caa కు వ్యతిరేకంగా తీర్మానం మార్చిలో చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నమని,తెలంగాణరాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదుల ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమలను,ర్యాలీలు,సభలను చేపడితే అడ్డుకోవడం, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశ పర్యటన వ్యతిరేకిస్తూ వామపక్షాలు ఆందోళన చేసేందుకు పిలుపు నిచ్చామని మన దేశం పై అమెరికా పెత్తనం ఎందని ప్రశ్నిo చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ మాజీ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రతినిధులు పాల్గొన్నారు.

 

First published: February 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు