గత వారం రోజులుగా వరి కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరుచుకుపడుతున్నాయి.. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లను కేంద్రం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాలు నిర్విహించగా.. బీజేపీ ఒకరోజు ముందుగానే వానకాలం పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు నిర్వహించారు.ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో మధ్యలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. వరిపంట వేయడంతో పాటు తాత్కలిక కొనుగోళ్లలో సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కమ్యునిస్టులు పార్టీలు చాలా రోజుల తర్వాత కదం తొక్కాయి.. ఇరు పార్టీలు చేస్తున్న వైఖరికి నిరసనగా.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, యాసంగి లో వరి పంట వెయ్యద్దన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. అయితే ఈ ధర్నాలో ఉద్రిక్తత ఏర్పడింది. ధర్నా అనంతరం ఆర్డీవో కు వినతిపత్రం ఇవ్వడానికి కార్యాలయంలోకి వెళ్లకుండా సిపిఐ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు సిపిఐ పార్టీ కార్యకర్తలకు మద్య వాగ్వాదం, తోపులాటకు దారి తీసి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇది చదవండి : 4 నెలలు కాదు..7 సంవత్సరాలుగా పెండింగ్.. నీటి వివాదంపై మంత్రి హరీష్ రావు.
ఈ సందర్భంగా చాడా వెంకట రెడ్డి మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చింది బిజెపి కేంద్ర ప్రభుత్వమని, కానీ రాష్ట్రంలో మాత్రం అదే బిజెపి ధర్నాలు చేయడం సిగ్గు చేటన్నారు. ముందు వడ్లు కొనుగోలు చేయడానికి రాష్ట్ర బిజెపి నాయకులు కేంద్రం పై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బిజెపి, టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ధర్నాలు ఎవరి చెవుల్లో పూలు పెట్టడం కోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో కాదు ధర్నాలు చేసేది, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేయాలన్నారు.
ఇది చదవండి : ఈ పోలీసులకు ఏమైంది.. ఇంకా తీరు మారలేదా.. ? జై భీం రీపిట్ అవుతుందా..?
ఇక టిఆర్ఎస్ ధర్నాలు చేస్తే పోలీసులు సహకరిస్తారు, మేము ధర్నాలు చేస్తే అరెస్టు చేస్తారని ఆరోపించారు. హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ ను ఎత్తివేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు అదే ఇందిరా ధర్నా చౌక్ లోనే ధర్నా చేయడం టీఆరెఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూన్నాడా, లేడా అనే దానిపై స్పష్టత నివ్వాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Siddipeta, Telangana Politics