హోమ్ /వార్తలు /తెలంగాణ /

వీధి కుక్కల దాడిలో ఆవు లేగ మృతి.. సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు జరిపిన కాలనీవాసులు

వీధి కుక్కల దాడిలో ఆవు లేగ మృతి.. సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు జరిపిన కాలనీవాసులు

వీధి కుక్కల దాడిలో ఆవు లేగదూడ మృతి చెందాయి. మృతి చెందిన ఆ ఆవు లేగదూడలకు కాలనీవాసులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపి వాటి పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

  నిండు గర్భిణీతో ఉన్న ఆవు.. నిన్ననే ఒక లేగదూడకు జన్మనిచ్చింది. దూడను తన పక్కలో పడుకోబెట్టుకున్న ఆ ఆవు.. మధ్యాహ్నం సమయంలో కునుకు తీస్తుండగా.. ఎక్కడినుంచి వచ్చాయో గానీ ఒక కుక్కల గుంపు అక్కడికి వచ్చింది. అచేతనావస్థలో పడి ఉన్న ఆ ఆవు దూడపై దాడి చేసి.. వాటిని చంపివేశాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రణదీవేనగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఆవు లేగదూడ మృతి చెందాయి. మృతి చెందిన ఆ ఆవు లేగదూడలకు కాలనీవాసులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపి వాటి పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. స్థానికంగా ఈ ఘటన అందరినీ కలిచివేసింది.

  అసలు విషయంలోకి వస్తే.. ఆదిలాబాద్ పట్టణ శివారులో ఉన్న రణదీవేనగర్ కాలనీలోని పొచమ్మ ఆలయానికి చెందిన ఆవు బుధవారమే ఓ లేగ దూడకు జన్మనిచ్చింది. అచేతన స్థితిలో ఉన్న ఆ ఆవు, దూడపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తల్లీబిడ్డ (ఆవు-లేగ) ప్రాణాలు కోల్పోయాయి. విషయం తెలుసుకున్న కాలనీవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆ మూగజీవాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డప్పు చప్పుళ్ళతో కాలనీలో అంతిమ యాత్ర నిర్వహించి, కాలనీ పొలిమేరలో ఖననం చేసి సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు జరిపారు.

  కాలనీకి చెందిన మహిళలతోపాటు చిన్నాపెద్దా అంతా కలిసి శవయాత్రలో పాల్గొనడం మూగజీవాల పట్ల వారికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసింది. వాటిని సాగనంపేటప్పుడు అక్కడున్న వారంతా విషణ్ణవదనంతో వాటికి అంత్యక్రియలు జరిపించడం అందరినీ కలిచివేసింది.

  First published:

  Tags: Adilabad, Attack, Dog, Stray dogs attack, Telangana, Telangana News

  ఉత్తమ కథలు