Home /News /telangana /

COVID VACCINATION TO RTC EMPLOYEES ORDERS GIVEN TO HEALTH DEPARTMENT OF TELANAGANA VRY HYD

Covid Vaccine : ఆర్టీసీ ఉద్యోగులకు... కొవిడ్ వ్యాక్సినేషన్..రేపటి నుండి అమలు

ఆర్టీసీ ఉద్యోగులకు... కొవిడ్ వ్యాక్సినేషన్..రేపటి నుండి అమలు

ఆర్టీసీ ఉద్యోగులకు... కొవిడ్ వ్యాక్సినేషన్..రేపటి నుండి అమలు

Covid Vaccine : ఆర్టీసీ ఉద్యోగులకు కూడ కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల క్రితం సూపర్ స్ప్రెడర్స్‌ కు వ్యాక్సిన్ ఇస్తున్న నేపథ్యంలోనే ఆదివారం నుండి ఆర్టీసీ ఉద్యోగులకు కూడ వేయాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

ఇంకా చదవండి ...
ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బంధిని కూడ సూపర్‌స్ప్రెడర్స్‌గా గుర్తించింది. దీంతో వారికి కూడ ఆదివారం నుండి వ్యాక్సిన్ వేయనున్నారు.ఇందుకోసం సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేశారు..దీంతో పాటు మొత్తం మూడు రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు.

తెలంగాణలో కరోనా వాహకులుగా భావిస్తున్న సూపర్ స్ప్రెడర్స్ కు శుక్రవారం నుండి వ్యాక్సినేషన్ వేస్తున్న విషయం తెలిసిందే..కాగా ఆటో డ్రైవర్స్ నుండి రేషన్ డీలర్లు, మార్కెట్ విక్రేతలతోపాటు జర్నలిస్టులు తదితర 20 కేటాగిరిల ప్రజలకు వ్యాక్సినేషన్ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది..దీంతో మొత్తం వీరంతా కలిసి 25 లక్షల వరకు ఉండచ్చొని అంచనా వేసింది.. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నుండి వీరికి ముందుగా టోకెన్లు ఇచ్చి వ్యాక్సిన్ వేస్తున్నారు.

ప్రభుత్వ రవాణా రంగంలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం ఈ వెసులు బాటు కల్పించలేదు..దీంతో ఆర్టీసీ ఉద్యోగులు తమకు కూడ వ్యాక్సినేషన్ చేయించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం 45 సంవత్సరాలు పైపడిన ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సిన్ చేయించారు. అయితే అప్పుడు కూడ ఎక్కువగా ఆసక్తి చూపించలేదు..ప్రస్తుతం వారు విధుల్లోకి వెళ్లేందుకు బయపడున్నారు. దీంతో వ్యాక్సిన్ ఇప్పించకుంటే అసలు విధుల్లోకి రామని ఉద్యోగులు తేల్చి చెప్పారు. ఇదే విషయమై చర్చించిన ప్రభుత్వం ఆదివారం నుండి వారికి కూడ వ్యాక్సిన్స్ ఇప్పించాలని నిర్ణయించింది.
Published by:yveerash yveerash
First published:

Tags: Rtc, Telangana, Tsrtc, Vaccination

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు