Covid vaccination : బ్యాంకు సిబ్బందికి కోవిడ్ వ్యాక్సినేషన్... వారం పాటు స్పెషట్ డ్రైవ్...!

బ్యాంకు సిబ్బందికి కోవిడ్ వ్యాక్సినేషన్... వారం పాటు స్పెషట్ డ్రైవ్...!

Covid vaccination : త్వరలో రాష్ట్రంలోని బ్యాంకు అధికారులకు సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది..వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ ద్వార వ్యాక్సినేషన్ చేయించనుంది.

  • Share this:


రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది..అయితే ప్రాధాన్యతల ఆధారంగా ఇప్పిటికే ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ వేయగా.. గత కొద్ది రోజులుగా సూపర్‌స్ప్రెడర్స్ గా గుర్తించి పలు వర్గాల వారికి వ్యాక్సిన్ ఇప్పించింది..తాజాగా బ్యాంకు సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి వ్యాక్సినేషన్ ను వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం వివిధ బ్యాంకుల ప్రతినిధులతో బ్యాంక్ అధికారులు, సిబ్బంది వ్యాక్సినేషన్ పై బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అభిలషిస్తున్నారని, అక్టోబర్ మాసాంతం నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేసెందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మొదటి దశలో హై ఎక్స్ పోజర్ గ్రూప్స్ కు వ్యాక్సిన్ అందించామని, ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తున్న వారికి దశల వారీగా వ్యాక్సిన్ ప్రక్రియను చేపట్టామని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ద్వారా అధిక మొత్తంలో వ్యాక్సిన్ డోస్ లను పొందేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణా రావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, పరిశ్రమల మరియు ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ రిజ్వీ, , SLBC కన్వీనర్ శ్రీ కృష్ణ శర్మ, చైర్మన్ APGVB శ్రీ ప్రవీణ్ కుమార్ , TSCOB మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్.మురళీధర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Published by:yveerash yveerash
First published: