• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • COVID VACCINATION HERE IS THE LIST OF PRIVATE HOSPITALS IN TELANGANA WHERE VACCINE WILL BE AVAILABLE ON PAYMENT FROM 1ST MARCH NK

Covid 19: రేపటి నుంచి తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్. ఆస్పత్రుల లిస్ట్ ఇదే

Covid 19: రేపటి నుంచి తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్. ఆస్పత్రుల లిస్ట్ ఇదే

రేపటి నుంచి తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్. (image credit - twitter - reuters)

Coronavirus updates: దేశంలోని కొన్ని రాష్ట్రాలతోపాటూ తెలంగాణలో కూడా కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో వ్యాక్సిన్ మరింత అందుబాటులోకి వస్తుండటం మంచి పరిణామం.

  • Share this:
    Coronavirus updates: తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ల పంపిణీలో మరో అడుగు ముందుకు వేసింది. రేపటి నుంచి 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి ప్రభుత్వమే వ్యాక్సిన్ ఉచితంగా వేయనుంది. అలాగే... 20 రకాల దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లకు పైబడిన వారికి కూడా ప్రభుత్వం రేపటి నుంచి వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తుంది. ఐతే... వీలైనంత త్వరగా ఎక్కువ మందికి వ్యాక్సిన్ చేరాలి కాబట్టి... ప్రైవేట్ ఆస్పత్రులు కూడా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాల్ని అమలు చేస్తోంది. అంటే... ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక్కో కరోనా వ్యాక్సిన్ రూ.150 ఉంటుంది. దాన్ని ఇచ్చినందుకు సర్వీస్ ఛార్జి కింద మరో రూ.100 వసూలు చేయవచ్చు అని కేంద్రం ఛాన్స్ ఇచ్చింది.

    ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రి సర్వీస్ ఛార్జి రూ.100 కంటే తక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఎక్కువ మాత్రం తీసుకోవడానికి వీలు లేదు. అంటే... రేపటి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ పొందాలనుకుంటే రూ.250కి లభిస్తుంది అనుకోవచ్చు. మరి ప్రభుత్వం ద్వారా ఉచితంగా వ్యాక్సిన్ పొందాలా లేక... ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి మనీ ఇచ్చి వ్యాక్సిన్ పొందాలా అనేది ప్రజల ఇష్టం. ఐతే... ప్రైవేట్ ఆస్పత్రుల్లో అన్నింటికీ వ్యాక్సిన్ ఇచ్చే అనుమతి లేదు. ప్రజలు గందరగోళం చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏయే ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి ఇచ్చిందీ ఓ లిస్ట్ రెడీ చేసింది. అది ఇదే. జూమ్ చేసి చూడండి... ఆస్పత్రుల వివరాలు తెలుస్తాయి.

    Covid Vaccination, Coronavirus Vaccination, UK Virus, coronavirus updates, coronavirus vaccine, coronavirus drug, corona vaccine, corona update, corona virus, covid 19, కరోనా డ్రగ్, కరోనా మందు, కరోనా వ్యాక్సిన్, కరోనా అప్‌డేట్, కరోనా న్యూస్, కొవిడ్ 19 న్యూస్,
    రేపటి నుంచి తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్. ఆస్పత్రుల లిస్ట్ ఇదే


    ఇక తెలంగాణలో కొత్తగా అంటే నిన్న 176 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2.98 లక్షలు దాటింది. నిన్న ఒకరు చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1634కి చేరింది. అలాగే... నిన్న 163 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాబట్టి మొత్తం రికవరీల సంఖ్య 2,95,222 ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1951 ఉండగా... వాటిలో 859 మంది ఇళ్లలో ఉంటూ ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.8 శాతం ఉంది. దేశంలో కంటే పరిస్థితి తెలంగాణలో మెరుగ్గానే ఉంది. నిన్న తెలంగాణలో 40,985 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 87,00,651కి చేరింది.

    India Covid 19: ఇండియాలో కొత్తగా 16,752 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1.11 కోట్లకు దగ్గర్లో ఉంది. నిన్న 113 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,57,051కి చేరింది. మరణాల రేటు దేశంలో 1.4 శాతం ఉంది. నిన్న 11,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1.07 కోట్లు దాటింది. దేశంలో రికవరీ రేటు 97.1 శాతం ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,64,511 ఉన్నాయి. నిన్న దేశంలో 7,95,723 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 21.62 కోట్లు దాటింది.

    ఇది కూడా చదవండి: Forehead lines: తల రాతలకు అర్థమేంటి.. భవిష్యత్తును తెలుసుకోవచ్చా?

    నిన్న యాక్టివ్ కేసులు 4921 పెరిగాయి. రోజురోజుకూ అవి ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం 20 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నిన్న ఒక్క రోజే మహారాష్ట్రలో 4924 యాక్టివ్ కేసులు పెరిగాయి. పంజాబ్‌లో 214, మధ్యప్రదేశ్‌లో 148, కర్ణాటకలో 137, గుజరాత్‌లో 122, హర్యానాలో 102, ఢిల్లీలో 76 చొప్పున యాక్టివ్ కేసులు పెరిగాయి. తెలంగాణలో 12 పెరగగా... ఆంధ్రప్రదేశ్‌లో 32 పెరిగాయి. అంటే... తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా జోరు ఇప్పుడిప్పుడే పెరుగుతోంది అనుకోవచ్చు. ఇప్పటికీ డాక్టర్లు మాస్క్ వాడాలనీ, శానిటైజర్ రాసుకోవాలనీ... సేఫ్ డిస్టాన్స్ పాటించాలని పదే పదే కోరుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు