• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • COVID RESTRICTIONS ON HOLI CELEBRATIONS UGADI AND RAMZAN HERE IS NEW RULES IN TELANGANA SK

Telangana: తెలంగాణలో హోలీ, ఉగాది, రంజాన్ సహా అన్ని పండుగలపై ఆంక్షలు.. ఇవీ రూల్స్

Telangana: తెలంగాణలో హోలీ, ఉగాది, రంజాన్ సహా అన్ని పండుగలపై ఆంక్షలు.. ఇవీ రూల్స్

(ప్రతీకాత్మక చిత్రం)

Telangana: రాబోయే అన్ని మతాల పర్వదినాలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. హోలీ, ఉగాది, శ్రీరామ నవమి, రంజాన్, గుడ్‌ఫ్రైడే వేడుకలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీచేసింది. శోభాయాత్రలు, ర్యాలీలు, ప్రజలు గుంపులుగా తిరగడంపై నిషేధం విధించింది.

  • Share this:
    తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. ఎవరూ ఊహించని విధంగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిది. లాక్‌డౌన్ ఉండబోదని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ.. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అందరూ మాస్క్‌లు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరకూడదని.. స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు. ఐతే రాబోయే రోజుల్లో వరుసగా పండుగలు ఉన్నాయి. పండగ వేళ జనమంతా ఒక్కదగ్గరికి చేరితే కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    రాబోయే అన్ని మతాల పర్వదినాలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. హోలీ, ఉగాది, శ్రీరామ నవమి, రంజాన్, గుడ్‌ఫ్రైడే వేడుకలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీచేసింది. శోభాయాత్రలు, ర్యాలీలు, ప్రజలు గుంపులుగా తిరగడంపై నిషేధం విధించింది. తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు భారీ ర్యాలీలు, ఉత్సవాలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందరూ ఇళ్లల్లోనే ఉండి పండగలు జరుపుకోవాలని సూచించింది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని.. లేదంటే విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

    లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

    కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 495 మంది కరోనా బారినపడ్డారు. మరో 247 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కరోనాతో మరో ఇద్దరు చనిపోయారు. నిన్నటి కేసులతో కలిపి.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,804కి చేరింది. ఇప్పటి వరకు 2,99,878 మంది కోలుకోగా.. కరోనా కాటుకు 1685 మంది బలయ్యారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం 4,241 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 1,870 మంది ఇళ్లల్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. మన దేశంలో కరోనా మరణాల రేటు 1.4శాతం ఉంటే.. తెలంగాణలో 0.55శాతంగా ఉంది. జాతీయస్థాయి రికవరీ రేటు 94.8గా ఉంటే తెలంగాణలో 98.06శాతంగా ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 58,029 మందికి పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 99,61,154 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రతి పది లక్షల మందిలో 2,67,629మంది కోవిడ్ పరీక్షలు చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు