Covid Free Villages: ఆ మూడు గ్రామాల్లో ఒక్క కరోనా కేసు లేదు.. ఇక ముందు రాబోదు.. ఎందుకో తెలిస్తే మీరు పాటిస్తారు.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

Covid Free Villages: కరోనాతో ప్రపంచమంతా వణికిపోతుంటే అక్కడ మాత్రం కరోనా రావాలంటేనే గజగజలాడుతోంది. నిర్మల్ జిల్లా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని సారంగాపూర్ మండల పరిధిలోని పెంటదరి, ఇప్పచల్మ, లక్ష్మీ నగర్ గ్రామాల ప్రజలు ఏమి చేస్తున్నారో.. కరోనా రాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారో చూద్దాం..

 • Share this:
  తెలగాణలో ప్రస్తుతం కరోనా పల్లెలను కూడా తాకింది. దాదాపు ప్రతీ పల్లెలో ఒక్కరికైనా కరోనా బారిన పడినవాళ్లు ఉన్నారు. కానీ నిర్మల్ జిల్లా లోని సారంగాపూర్ మండల పరిధిలోని పెంటదరి, ఇప్పచల్మ, లక్ష్మీ నగర్ మూడు ఆదివాసి గ్రామాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అందుకు ఆ గ్రామాల ఆదివాసీ ప్రజలుపెట్టుకున్న కట్టుబాట్లే అందుకు నిదర్శనం. వారు అమలు చేసుకుంటున్న కఠిన నియమ నిబంధనలే వారి ప్రాణాలకు శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయి. అటు చూస్తే మహారాష్ట్ర లక్షల్లో కేసులు, ఇటు చూస్తే తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో వందల్లో కేసులు నమోదవుతున్నాయి. వీటి మధ్యలో ఉన్న ఈ మూడు గ్రామాల్లో మాత్రం వాటి తాకిడి తగల్లేదు. మహామ్మారి తమ గ్రామంలోకి మాత్రం ఎంట్రీ ఇవ్వకుండా గట్టి చర్యలే తీసుకుంటున్నారు ఇక్కడి గ్రామస్తులు. మనం చిన్న తనంలో అంబలిని ఎక్కవగా సేవించేవారం. ఇప్పడు అదే వీరిని కాపాడుతుంది. ప్రతీ రోజు మూడు పూటలు అంబలిని ఆహారంగా తీసుకుంటారు. తమ పొలంలో పండిన పౌష్టికాహారాన్నే తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.

  వేడి నీళ్లు తాగడం, బయటకు వెళ్లి వచ్చిన ప్రతీ ఒక్కరు పసుపు నీళ్లతో స్నానం చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలకే ఆహారం లో ఎక్కువ చోటు ఇస్తారు. ఇవే ఇక్కడి ప్రజలను కరోనా నుండి దూరంగా ఉంచడానికి సాయపడుతున్నాయని పెంటదరి ఆదివాసీ గ్రామ పటేల్ చెబుతున్నారు. ఇప్పచెల్మ గ్రామంలో అయితే 85 ఏళ్ల ఔషద మూలిక వైద్యుడు దొందన్న ఇచ్చే మూలికల ద్రావణమే ఇక్కడ అమృతంగా పనిచేస్తుందని తెలిపారు.. 21 ఔషద చెట్ల నుండి సేకరించిన మూలికలతో తయారు చేసిన కషాయాన్ని ప్రతి ఇంటికి పంపిణి చేస్తుండటం.. ఆ ఔషదం సేవిస్తున్న ఆదివాసీలకు జ్వరం, జలుబు కూడా దరిచేరదట.

  అయితే ఆ మూడు గ్రామాలకు చుట్టు పక్కల ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతుండటంతో మూతికి రూమాలు మాత్రం ధరిస్తున్నారు. ఎట్టి పరిస్థితిల్లో భయట వ్యక్తులను తమ ఊరిలోకి రానివ్వడం లేదు. శుభకార్యాలను వాయిదా వేసుకున్నారు. చావుకు వెళ్తే భౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి 6 దాటితే గడప దాటకూడదనే కఠిన నియమ నిబందనలు అమలు చేసుకుంటున్నామని చెబుతున్నారు. కరోనా వేళ ఇలాంటి పల్లెలు పాటిస్తున్న కట్టుబాట్లు పట్టణాలు కూడా తప్పక పాటిస్తే కరోనా ను అంతం చేయడం సులువు అవుతుంది.
  Published by:Veera Babu
  First published: