Home /News /telangana /

COVID CENTER INAGURATED BY MLC KAVITHA AT HYDERABAD HITEX VRY

covid center : హైటెక్స్‌లో కొవిడ్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవితా

 హైటెక్స్‌లో కొవిడ్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవితా

హైటెక్స్‌లో కొవిడ్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవితా

covid center :ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యుమన్ వాల్యూస్(ఐఏహెచ్ వీ) సంస్థలు, తెలంగాణ ప్రభుత్వం మరియు జిహెచ్ఎంసీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఎమ్మెల్సీ కవితా ప్రారంభించారు.

కరోనా మహమ్మారీ తరుముకొస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వంతో పాటు పలు ప్రైవేటు, స్వచ్చంధ సంస్థలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సోకిన రోగులకు సరిపడా బెడ్స్ లేకపోవడంతో చాల మంది ఆందోళనకు గురవుతున్నారు. తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు స్వచ్చంధ సంస్థలతోపాటు కార్పోరేట్ కంపనీలు, సామాజిక సేవ సంస్థలు కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్‌లో హైటెక్స్ లోని న్యాక్ లో ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఐఏహెచ్‌వీ సంస్థలు 200 పడకల కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో ఎమ్మెల్సి కల్వకుంట్ల కవితా ఈ సెంటర్‌ను ప్రారంభించారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యుమన్ వాల్యూస్(ఐఏహెచ్ వీ) సంస్థలు, తెలంగాణ ప్రభుత్వం మరియు జిహెచ్ఎంసీ సౌజన్యంతో ఈ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన 'ధ్యానం'లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఎంబీబీఎస్ పూర్తి చేసిన యువ వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. అంతేకాదు రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ, ఒక్కొక్కరికీ ఐదు కిలోల చొప్పున, వచ్చే రెండు నెలల పాటు ఉచిత బియ్యం అందించనున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. కోవిడ్ పేషంట్లకు ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఐఏహెచ్వీ సంస్థలను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ సైతం పాల్గొన్నారు
Published by:yveerash yveerash
First published:

Tags: Covid hospital, Hyderabad

తదుపరి వార్తలు