తెలంగాణ (Telangana) లో రోజు రోజుకు కరోనా కేసులు (Corona Cases) పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ మెడిసిన్ కిట్ వాడకంపై మార్గదర్శకాలను విడుదల చేసింది. IT & EC డిపార్ట్మెంట్ డిజిటల్ మీడియా (Digital Media)విభాగం వీటిని విడుదల చేసింది. ప్రజలు కోవిడ్-19 లక్షణాలను గమనించిన వెంటనే మందులు తీసుకోవడం ప్రారంభించాలని సూచించింది. అయితే వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాలని పేర్కొంది. వైద్యుల సలహాతో మందులు వాడితే కోవిడ్ తీవ్రతను పెరగకుండా ఆపొచ్చని ప్రభుత్వం పేర్కొంది.
Health Tips: కరోనా వేళ.. పిలల్లకు రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద చిట్కాలు!
ఏ మందులు ఎన్ని రోజులు వాడాలి..
- కోవిడ్ మందులలో ప్రతిరోజూ ఉదయం ఐదు రోజుల పాటు అజిత్రోమైసిన్ (యాంటీబయోటిక్/యాంటీవైరల్)
- పారాసెటమాల్ (జ్వరం కోసం) ఉదయం ఒకటి మరియు రాత్రి మరొకటి ఐదు రోజులు
- లెవోసెటిరిజైన్ (జలుబు కోసం) ప్రతి రాత్రి ఐదు రోజులు.
- రానిటిడిన్ (అసిడిటీ కోసం) ఉంటాయి. ) ప్రతిరోజూ ఉదయం ఐదు రోజులు.
- విటమిన్ సి, మల్టీవిటమిన్ మరియు విటమిన్ - డి (రోగనిరోధక శక్తి కోసం) ఐదు రోజులు.
వీటితో పాటు కోవిడ్ 19 లక్షణాలు (Covid 19 Symptoms) ఉంటే నిరంతరం టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. సాధారణ వేగంతో ఆరు నిమిషాలు నడవలేకపోవడం, జ్వరం మరియు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.
Omicron Symptoms: డెల్టాకు ఒమిక్రాన్‌కు తేడా ఏమిటీ.. ఒమిక్రాన్ అని ఎలా గుర్తుపట్టాలి!
రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు..
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 3,557 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 1474 కేసులు నమోదు కాగా.. హైదరాబాద్ పరిసర జిల్లాలైన రంగారెడ్డి జిల్లాలో 275, మేడ్చల్ జిల్లాలో 321 నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో మరో 123 కేసులు నమోదయ్యాయి. హన్మకొండ, ఖమ్మం జిల్లాల్లోనూ కేసుల నమోదు ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఈ రోజు కొత్తగా 104 కేసులు నమోదు కాగా, హన్మకొండ జిల్లాలో 130 కేసులు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 77, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో 72 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో తాజాగా నమోదైన 3,557 కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,18,196కు చేరింది.
ఒమిక్రాన్ సోకిన వారిలో ఎక్కువగా గుర్తించిన లక్షణాలు
- ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు.
- డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదు.
Covid 19 Vaccination: 14.29కోట్ల మందికి వ్యాక్సిన్లు.. దేశంలో 9శాతం వ్యాక్సినేషన్ అక్కడే!
- వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, CORONA MEDICINE, Covid-19 medicine, Telangana