COVID 19 GANGRENE IN INTESTINE POST CORONA CASES REPORTED IN HYDERABAD NIMS HERE IS MORE DETAILS SK
Covid-19: కుళ్లిపోతున్న పేగులు.. కరోనా తర్వాత మరో కొత్త వ్యాధి.. నిమ్స్‌లో 7 కేసులు.. ఎలా గుర్తించాలంటే..
Covid-19: ఇటీవల ఏడుగురు రోగులు తీవ్రమైన కడుపునొప్పితో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. పలు పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్లకు షాకింగ్ విషయం తెలిసింది. బాధితుల చిన్న పేగుల్లో రక్తం గడ్డకట్టింది. అది ముదిరి గ్యాంగ్రేన్‌గా మారింది. అంటే పేగులు కుళ్లిపోయాయి.
Covid-19: ఇటీవల ఏడుగురు రోగులు తీవ్రమైన కడుపునొప్పితో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. పలు పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్లకు షాకింగ్ విషయం తెలిసింది. బాధితుల చిన్న పేగుల్లో రక్తం గడ్డకట్టింది. అది ముదిరి గ్యాంగ్రేన్‌గా మారింది. అంటే పేగులు కుళ్లిపోయాయి.
ప్రస్తుతం మన దేశంలో కరోనా అదుపులోనే ఉంది. మరణాలు సంఖ్య బాగా తగ్గింది. రికవరీల సంఖ్య భారీగా ఉండడం ఊరటనిచ్చే విషయం. ఐతే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అంతా బాగానే ఉందని భావించడానికి లేదు. ఎందుకంటే కరోనా తర్వాత ఎన్నోకొత్త సమస్యలు వస్తున్నాయి. పలు రకాల వ్యాధులు వేధిస్తున్నాయి. తాజాగా మరో కొత్త వ్యాధిని డాక్టర్లు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న బాధితుల్లో పేగుల్లో గ్యాంగ్రీన్ (కుళ్లిపోవడం) రావడం ఆందోళన కలిగిస్తోంది. వైద్య పరిభాషలో హైపర్ కోయాగ్యులబులిటీ లేదా ప్రోత్రోంబొటిక్గా పిలుస్తారు. ఇటీవల ఏడుగురు రోగులు తీవ్రమైన కడుపునొప్పితో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. పలు పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్లకు షాకింగ్ విషయం తెలిసింది. బాధితుల చిన్న పేగుల్లో రక్తం గడ్డకట్టింది. అది ముదిరి గ్యాంగ్రేన్‌గా మారింది. అంటే పేగులు కుళ్లిపోయాయి. ఇద్దరు బాధితుల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో పేగులను తొలగించారు. కిడ్నీలు కూడా పాడవడంతో డయాలిసిస్ చేస్తున్నట్లు నిమ్స్ వైద్యులు వెల్లడించారు. గ్యాంగ్రీన్ కారణంగా ఆరోగ్యం క్షీణించి ఇప్పటికే ఇద్దరు మరణించారు.
ఈ వ్యాధిని ఎలా గుర్తించాలి?
ఎప్పుడూ లేని విధంగా కడుపు నొప్పి వస్తే జాగ్రత్త పడాలి. దానితో పాటు వాంతులు, నీళ్ల విరేచనాలు, నల్లరంగులో మలం, మూత్రంలో రక్తపు చారల వంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా మలం నలుపు రంగులో ఉంటే.. చిన్న, పెద్ద పేగుల్లో గ్యాంగ్రీన్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అలాంటి వారు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇలాంటి కేసులో ఒక్క నిమ్స్‌లోనే ఏడు ఉన్నాయి. ఏఐజీ, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్ని కేసులు నమోదయ్యాయి. వీరికి గతంలో కరోనా వచ్చిందా? అని డాక్టర్లు ఆరా తీయగా చాలా మంది తమకు రాలేదని చెప్పారు. కానీ పరీక్షల్లో మాత్రం కోవిడ్ యాంటీబాడీస్ గణనీయంగా ఉన్నట్లు వెల్లడైంది. అంటే వీరికి కరోనా వచ్చి పోయిందని.. లక్షణాలు కనిపించకపోవడంతో కరోనా సోకనట్లుగా భావించారని వైద్యులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఈ లక్షణాలకు సంబంధించిన కేసులు నమోదు అవుతుండడంతో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిమ్స్ ప్రొఫెసర్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్. బీరప్ప అన్నారు.
కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురైన వారు, దీర్ఘకాలిక జబ్బులున్నవారు, బీపీ, ఊబకాయం, గుండె సంబంధిత జబ్బులు, ఎక్కువకాలం ఎటూ కదలకుండా ఒకేచోట గడిపే వారికి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశముందని నిమ్స్ వైద్యులు వెల్లడించారు. గతంలో ఎలాంటి దీర్ఘకాలిక, ఇతర జబ్బులు లేని వారి లోనూ గుర్తించినట్లు చెప్పారు. ఈ వ్యాధి పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడాలని.. తద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.