Home /News /telangana /

Karimnagar : అధికార పార్టీకి కోవర్టుల భయం.. తెరవెనుక చక్రం తిప్పుతున్న ఈటల..

Karimnagar : అధికార పార్టీకి కోవర్టుల భయం.. తెరవెనుక చక్రం తిప్పుతున్న ఈటల..

టీఆర్ఎస్

టీఆర్ఎస్

Karimnagar :కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి కొత్తగా కోవర్టుల భయం పట్టుకుంది. సొంత పార్టీలోని నేతలే కీలక సమయంలో మాట మారుస్తు..బేరాసారాలు చేస్తున్నారు.. ( karimnager mlc elections )దీంతో తమ పార్టీ నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు జిల్లా నేతలు అష్టకష్టాలు పడుతున్నారు.

ఇంకా చదవండి ...
  న్యూస్ 18తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్. పి

  కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి కొత్తగా కోవర్టుల భయం పట్టుకుంది. సొంత పార్టీలోని నేతలే కీలక సమయంలో మాట మారుస్తు..బేరాసారాలు చేస్తున్నారు.. దీంతో తమ పార్టీ నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు జిల్లా నేతలు అష్టకష్టాలు పడుతున్నారు. ( karimnager mlc elections ) ఇలా కొనసాగితే... ముఖ్యమంత్రి నుండి ఎక్కడ మాటలు పడాల్సి వస్తుందోనే ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా రవీందర్ సింగ్ రంగంలోకి దిగగడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ముందస్తు వ్యుహాలనే రచించారు. అయినా.. గడిచిన హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతల వ్యుహాలు బెడిసి కొట్టాయి.అనుహ్య రీతిలో ఈటల రాజేందర్ గెలుపును సొంతం చేసుకున్నాడు.

  తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందా అనేది ఆ పార్టీ నేతల అంతర్గత ఆందోళనగా కనిపిస్తోంది. ముఖ్యంగా జిల్లా మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలకు గెలుపు బాధ్యతను అప్పగించారు. దీంతో ఆయా మంత్రులు , ఎమ్మెల్యేలు ఓట్లు వేయించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వారికి తాయిలాలు ఇస్తామంటూ ఫోన్లు చేస్తున్నారు. ( karimnager mlc elections )దీనికి సంబంధించిన ఆడియో టేపు కూడా ఒకటి బయటపడింది. ఇందులో సొంతపార్టీకి చెందిన నేతలే హ్యండిస్తున్నట్టు స్పష్టం అవుతోంది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికరంగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీటిసీలు ఉన్నారు. రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ వీరినే టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు రవీందర్ సింగ్ గెలుపుకు ఈటల రాజేందర్ చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నవారి జాబితాను సిద్దం చేసి వారిని ఏదో ఒక రూపంలో మంచి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.( karimnager mlc elections ) దీంతో ఒక ఓటును మాత్రం రవీందర్ సింగ్ కు వేసి మిగతా ఓటును వాళ్ల ఇష్టం వచ్చిన వ్యక్తికి వేసుకునే విధంగా ఆఫర్ ప్రకటిస్తున్నట్టు సమచారం.

  Bandi sanjay : ఎలా.. ధాన్యం కోనుగోలు కేంద్రాలు మూస్తారో... మేము చూస్తాం...!


  అయితే ఇదంతా గమనిస్తున్న టీఆర్ఎస్ నేతలు ముందుగానే వారి పార్టీ ప్రజా ప్రజానిధులను కుటుంబ సభ్యులతో కలిసి క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. తమ ఆధీనంలో ఉంచి నేరుగా ఎన్నికల తేదిన పోలీంగ్ స్టేషన్‌కు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేశారు. ( karimnager mlc elections )అయితే ఇంత చేసినా.. వారి మనసుల్లో ఏముందో అనే ఆందోళన మాత్రం ఆపార్టీ నేతలను వెంటాడుతోంది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు మెజారీటిగా ఉండడం .. వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో పాటు సర్పంచ్‌లు కూడా చాలా చోట్ల అప్పుల పాలు కావడం కూడా వ్యతిరేకతకు కారణం కావచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

  ఇందుకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ సైతం ( cm kcr ) ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు ఓడిపోతే పార్టీకి వచ్చే నష్టం లేదని, రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని ముందే కొట్టి పారేశారు. ( karimnager mlc elections )దీంతో ఆపార్టీ నేతల్లో మరింత గుబులు పట్టుకున్నట్టు సమాచారం.కాగా హుజూరాబాద్ ఉప ( Huzurabad ) ఎన్నికల్లో కూడా మంత్రి కేటిఆర్ కూడా చాలా చిన్న విషయంగా కొట్టిపారేశారు. దాన్ని జిల్లా నేతలే చూసుకుంటారంటూ ప్రకటనలు చేశారు. ఇప్పుడు కూడా కేసిఆర్ చేసిన వ్యాఖ్యల వెనక మతలబు ఇదేనని అంటున్నారు. ఏది ఏమైనా.. డిశంబర్ 10 వరకు అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

  మీ నగరం నుండి (కరీంనగర్)

  తెలంగాణ
  కరీంనగర్
  తెలంగాణ
  కరీంనగర్
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Karimnagar, Mlc elections

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు