Home /News /telangana /

COURT REJECTED BANDI SANJAY BAIL PETITION VRY KNR

Bandi sanjay : బండి సంజయ్‌ జైలుకు.. . బెయిల్ నిరాకరణ

bandi sanjay

bandi sanjay

Karimnagar : బండి సంజయ్‌కు కోర్టులో చుక్కెదురైంది.. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు, మరోవైపు బెయిల్‌ పిటిషన్ నిరాకరించడంతో.. జైలుకు తరలించారు. కాగా ఈనెల 17వరకు జ్యూడిషియల్ రిమాండ్‌ విధిస్తూ. కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంకా చదవండి ...
    కరీంనగర్ లో జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ తో సహా 16 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు బండి సంజయ్‌తో పాటు మరో ఐదుగురిని మాత్రమే కోర్టులో హాజరుపరిచారు . మిగతా వారు పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు ..

    317జీవోకు నిరసనగా బండి సంజయ్‌ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ను నిన్న రాత్రి మానకొండూర్‌ నుంచి కరీంనగర్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించారు.  నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి, అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు..   కరీంనగర్‌ కోర్టులో నేడు హాజరుపరిచారు. కాగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని సంజయ్‌పై కేసు నమోదు చేశారు.

    బండి సంజయ్‌ తరఫున బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన భాజపా లీగల్‌ సెల్‌.. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీసీ 353 సెక్షన్‌పై లీగల్‌ సెల్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో బండి సంజయ్‌పై నమోదైన కేసులను పోలీసులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయనపై నమోదైన 10 కేసులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బండి సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. బండి సంజయ్‌పై మొత్తంగా 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. రెండో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా బండి సంజయ్‌ సహా ఐదుగురికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. కోర్టు తీర్పు అనంతరం వారిని కరీంనగర్‌ జైలుకు తరలించారు. బెయిల్‌ కోసం బండి సంజయ్‌ జిల్లా కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. అయితే జైలులో బండి సంజయ్‌కి అందించే ఆహారాన్ని జైలర్‌ రుచి చూశాకే ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.

    బండి సంజయ్ అరెస్ట్ , ఆ తర్వాత పరిణామాలు టెన్షన్‌ను క్రియెట్ చేశాయి..... ఆయన అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ఉద్రిక్తలు రేకెత్తిస్తున్నాయి.. ఇప్పటికే ఆయన అరెస్ట్‌కు నిరసనగా ఆపార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళలనకు పిలుపునిచ్చింది. మరోవైపు పోలీసు ట్రైనింగ్ సెంటర్‌ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన నిర్వహించారు. అయితే పోలీసులు కొవిడ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుండడంతో వారిని అరెస్ట్ చేశారు. కాగా ఈ మొత్తం ఎపిసోడ్‌లో 70 మందికి నోటిసులు ఇచ్చామని .. కార్యకర్తల దాడిలో పోలీసులు కూడా గాయపడ్డారని అంతకు ముందు కరీంనగర్ సీపీ సత్యనారాయణ  తెలిపారు.

    మరోవైపు ఆయన అరెస్ట్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. తలుపులు పగుల గొట్టి ఆయనపై దాడి చేశారని ఆరోపించారు. సొంత ఆఫీసులో దీక్ష చేస్తున్నా..కరోనా సాకులతో అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అంతకుముందు  పోలీసుల కస్టడీలో ఉన్న బండి సంజయ్‌కు   జేపీ నడ్డా ఫోన్ చేసి మాట్లాడారు..  కేసులకు బయపడకుండా ఉద్యోగులు , ఉపాధ్యాయుల పక్షాన నిలబడాలని ఆయన సూచించారు. కేసులు ఏవైనా ఉంటే తాము చూసుకుంటామని భరోసా ఇచ్చారు. జాతీయ నాయకత్వం మొత్తం సంజయ్ వెంట ఉంటుందని చెప్పారు.

    మీ నగరం నుండి (కరీంనగర్)

    తెలంగాణ
    కరీంనగర్
    తెలంగాణ
    కరీంనగర్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bandi sanjay, Karimnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు