హోమ్ /వార్తలు /తెలంగాణ /

Suicide : సెలవు ఇవ్వలేదని ఓ ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య..

Suicide : సెలవు ఇవ్వలేదని ఓ ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Suicide : తాను పనిచేసే సంస్థలో సెలవు ఇవ్వకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్యచేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

  ప్రైవేటు కోరియర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ యువకుడు తాను అడిగినప్పుడు సెలవు ఇవ్వకపోవడంతో పాటు సహ ఉద్యోగుల వేధింపులు కూడా ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కార్వాన్‌లో ఉండే సూర్యవంశీ అనిల్ కుమార్ అనే వ్యక్తి శంషాబాద్‌లోని కోరియర్ కార్యలయంలో బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం అర్థరాత్రి ఘట్‌కేసర్ సమీపంలోని వరంగల్ హైవే పక్కన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం వెళ్లింది. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరకున్న పోలీసులు ఆయన్ను గుర్తించేందుకు ఆధారాలు సేకరించే సమయంలో జేబులో సూసైడ్ నోట్ లభించింది. అందులో తాను పనిచేస్తున్న ఆఫీసులో సెలవు కావాలని అడుగుతున్నా ఇవ్వకపోవడంతో పాటు తోటి ఉద్యోగుల వేధింపులతో మనస్థాపం చెందానని అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నోట్‌లో రాసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  వదినపై కోపంతో 4 ఏళ్ల బాలుడి హత్య 

  మరోవైపు తన వదిన ఉన్న కోపంతో నాలుగు సంవత్సరాల చిన్నారి మెడకు వైర్ బిగించి ప్రాణాలు తీశాడు.వివరాల్లోకి వెళితే.. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లక్ష్మీగూడ రాజీవ్‌గృహకల్పలో మహేశ్వరి, వినోద్‌కుమార్‌రెడ్డి దంపతులు నివాసముంటున్నారు. వీరికి నాలుగు సంవత్సరాల లక్ష్మీనరసింహ ఉన్నాడు. కాగా మహేశ్వరి చెల్లెలు లక్ష్మి తన భర్తతో గొడవపడి సంవత్సర కాలం నుంచి స్థానిక శ్రీరామకాలనీలోని తన తల్లిగారింట్లో ఉంటుంది.

  ఇది చదవండి : సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి.. వరి కోనుగోలుపై తేల్చుకునేందుకు రెఢి


  వదిన తన భార్యను తన వద్దకు పంపడం లేదని వీరేశ్‌ కోపం పెంచుకున్నాడు.దీంతో శనివారం ఉదయం 9 గంటల సమయంలో రాజీవ్‌గృహకల్పకు వచ్చి తన వదిన అయిన మహేశ్వరి కుమారుడు లక్ష్మీనరసింహను ఇంట్లో వాళ్లకు తెలియకుండా వెంట తీసుకెళ్లాడు. సాయంత్రం జల్‌పల్లి ఇందిరా సొసైటీ డంపింగ్‌ యార్డ్‌ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో చిన్నారి బాలుడి మెడకు వైర్‌ బిగించి.. అత్యంత దారుణంగా హత్య చేశాడు. అయితే ఇదేది తెలియని బాలుడి తల్లిదండ్రులు తన కొడుకు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు, దీంతో స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే బాబును తీసుకువెళ్లి హత్య చేసిన నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime, Hyderabad, Suicide

  ఉత్తమ కథలు