Home /News /telangana /

COUPLE WHO GAVE THEIR DOUBLE BEDROOM HOUSE IN SIDDIPET TO THE MINISTER TO GIVE IT TO THE POOR SNR MDK

Telangana : డబుల్ బెడ్రూం ఇల్లు తిరిగి ఇచ్చిన దంపతులు .. మంత్రి ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా..?

minister harishrao

minister harishrao

Telangana : ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత పొందాలంటే అదృష్టం ఉండాలి. తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ రెండు గదుల ఇంటి కోసం లక్షలాధి మంది దరఖాస్తులు చేసుకున్నారు. కొందరైతే ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. అలాంటిది డబుల్ బెడ్రూం ఇల్లు ప్రభుత్వం కేటాయిస్తే ..ఆ దంపతులు ఏం చేశారో తెలుసా.

ఇంకా చదవండి ...
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత పొందాలంటే అదృష్టం ఉండాలి. ముఖ్యంగా తెలంగాణ(Telangana)లో ప్రభుత్వం అధిస్తున్న సంక్షేమ పథకాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ రెండు గదుల ఇంటి కోసం లక్షలాధి మంది దరఖాస్తులు చేసుకున్నారు. కొందరైతే ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. అలాంటిది డబుల్ బెడ్రూం(Double bedroom)ఇల్లు ప్రభుత్వం కేటాయిస్తే ..ఆ దంపతులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు.

Telangana Politics: బీజేపీ బలిసినోళ్ల పార్టీ .. కాంగ్రెస్ పేదల కన్నీళ్లు తుడిచే పార్టీ : ఎమ్మెల్యే సీతక్క



దంపతుల పెద్ద మనసు..
ఆర్ధికంగా వెనుకబడిన, నిరుపేదల కోసం ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు వాళ్లకే అందాలనే మంచి ఆలోచన చేశారు సిద్దిపేటకు చెందిన దంపతులు. సిద్దిపేట పట్టణానికి చెందిన కూరేళ్ళ రూప ఆమె భర్త కరుణాకర్‌రెడ్డి ఇద్దరూ ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తారు. ఈ దంపతులకు ఒక కొడుకు ఉన్నాడు. అతను మానసికంగా అనారోగ్యంతో ఉన్నాడు. కొడుకు ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో అతను తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు. కాబట్టి ముగ్గురు కలిసి సిద్దిపేటలోని నివసిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించిన చోటికి వెళ్లే పరిస్థితి లేదు.



డబుల్ బెడ్రూం తిరిగిచ్చిన పేదలు..
రూప కుట్టు మిషన్ కుట్టు జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త కూడా ఏదో పని చేసుకుంటూ టౌన్‌లోనే ఉంటున్నారు. మొత్తం ముగ్గురమే కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇల్లు వృధా అవుతుందని భావించారు. అందుకే ఆ ఇల్లు పేదలకు ఉపయోగపడాలనే ఆలోచనతో తమకు ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇంటిని తిరిగి ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే గురువారం రాష్ట్ర ఆరోగ్య, ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావును కలిసి డబుల్ బెడ్రూం పట్టా కాగితాలు , ఇంటి తాళం చెవి అప్పగించారు. తాము నిరుపేదలం కావడంతో దరఖాస్తు చేసుకున్నందుకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం అప్లై చేసుకుంటే వచ్చిందని కాని తాము ముగ్గురం అందులో ఉండలేమని కాబట్టి తమ లాంటి పేదలు ఎవరైనా ఉంటే వారికి ఇవ్వమని మంత్రిని కోరారు రూప దంపతులు.

Telangana : రాజగోపాల్‌రెడ్డి బాటలోనే దాసోజు శ్రవణ్ .. తెలంగాణ కాంగ్రెస్‌కి వరుస కష్టాలు



అభినందించిన మంత్రి..
గతంలో ప్రశాంత్ నగర్ కి చెందిన రచ్చ లక్ష్మి ఇదే విధంగా పేదలకు ఇవ్వమని డబుల్ బెడ్రూం ఇంటిని ఇచ్చారు. ఇప్పుడు కూరేళ్ళ రూప సైతం అదే విధంగా తనకు వచ్చిన ఇంటిని తిరిగి ఇవ్వడంపై మంత్రి హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇంకా ఎవరైనా ఉంటే ఇలాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇల్లు నిరుపయోగంగా పోకుండా ఒక నిరుపేద కుటుంభానికి ఇచ్చిన వాళ్ళంత అవుతాము అన్నారు... మేము ముగ్గురమే ఉంటామని మా ముగ్గురికి ఎందుకు నాలాంటి నిరుపేద కు ఈ డబుల్ బెడ్రూం ఇవ్వండి అని నిజాయితీ వచ్చి ఇంటి తాళం చెవి అప్పగిందన్నారు.. రూపను స్ఫూర్తి గా నిలిచి మానవత్వాన్ని చాటుకుంది చెప్పారు మంత్రి. అనారోగ్యంతో ఉన్న కొడుకు కలిగిన రూప కుటుంబాన్ని అన్నీ విధాలుగా సహాయం చేస్తామని మంత్రి మాటిచ్చారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం , మాజీ కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్ , దేవాలయ డైరెక్టర్ గుండు రవితేజ తదితరులు పాల్గొన్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Double bedroom houses, Siddipet, Telangana News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు