హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal : ఫేక్ కంపనీలతో షేర్ మార్కెట్.. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేరళ దంపతులు..

Warangal : ఫేక్ కంపనీలతో షేర్ మార్కెట్.. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేరళ దంపతులు..

పట్టుబడిన నిందితులు

పట్టుబడిన నిందితులు

Warangal : షేర్ మార్కెట్ ముసుగులో నకిలీ కంపనీల్లో పెట్టుబడులు పెట్టించి మోసాలకు పాల్పడుతున్న కిలాడి దంపతులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ నుండి ఢిల్లీకి మకాం మార్చిన దంపతులు కోట్ల రూపాయల కుచ్చుటోపి పెట్టారు.

షేర్ మార్కెట్ ముసుగులో నకిలీ కంపనీల్లో పెట్టుబడులు పెట్టించి మోసాలకు పాల్పడుతున్న కేరళకు చెందిన కిలాడి దంపతులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు.కేరళలోని ఎర్నాకులానికి చెందిన శివాణి బిజ్జు మాధవన్‌లు భార్యభర్తలు, వీరు ఢిల్లీలో ఉంటూ పీవీఆర్ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బోగస్ సంస్థను ఏర్పాటు చేసి, హైదరాబాద్ ,వరంగల్,విశాఖపట్నం తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మధ్యవర్తులను ఏర్పాటు చేసుకున్నారు.

వీరితో పి.వి.ఆర్ కన్సల్టెన్సీ ద్వారా ఆన్ లైన్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే 4 నుండి 8శాతంవరకు కమిషన్ ఇస్తామని ప్రజలను నమ్మించే వారు. ప్రజలకు తమపై నమ్మకం కలిగించేందుకుగాను ముందుగా నిందితులు ప్రజలు పెట్టిన పెట్టుబడికి పెద్దమొత్తం కమిషన్లు చెల్లించడం చేసేవారు. దీనితో కంపెనీపై నమ్మకం కుదిరిన ప్రజలు పి.వి.ఆర్ కన్సల్టెన్సీ ద్వారా ఆన్లైన్లో నకిలీ కంపెనీల్లో పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు.

Telangana BJP : బీజేపీ ఎమ్మెల్యేలకు కోర్టులో చుక్కెదురు.. సస్పెషన్ స్టే.. నిరాకరణ.

దీనితో ఎక్కువ మొత్తంలో తమ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు జమ అయిన వెంటనే ఈ కిలాడి దంపతులు బ్యాంకు నుండి డబ్బును డ్రా చేసుకోని ప్రజలను మోసం చేసేవారు. ఇదే రీతిలో హన్మకొండ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు గోగుల శ్రీనివాస్ ద్వారా కిలాడి దంపతులతో ఆన్లైన్ ద్వారా పరిచయం కావడంతో నిందితులు భాదితుడుని మోసపూరితమైన మాటలతో తమ కన్సల్టెన్సీ ద్వారా సుమారు కోటి రూపాయల పైగా పెట్టుబడులు పెట్టించి కొద్ది రోజులు సక్రమంగానే కమిషన్ చెల్లించిన నిందితులు కొద్ది రోజుల అనంతరం కన్సల్టెన్సీను మూసివేయడంతో పాటు నిందితులు అందుబాటులో లేకపోవడంతో పెట్టుబడిన పెట్టిన భాధితుడు మోసపోయినట్లుగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు...

దీంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులు దిల్లీలో వున్నట్లుగా గుర్తించారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి కోర్టుముందుంచారు. కాగా 50 గ్రాముల బంగారు అభరణాలు, రెండు ల్యాప్

టాప్‌లు స్వైపింగ్ మిషన్, ఎనిమిది సెల్ ఫోన్లు, చెక్ బులు, బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు,స్టాంపులు, కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

First published:

Tags: Crime news, Warangal

ఉత్తమ కథలు