COUPLE COMMITED SUICIDE DUE TO HEALTH PROPLEMS VRY KNR
karimnagar : కరీంనగర్లో కుళ్లిన శవాలు... పోలీసుల విచారణ
karimnagar : కరీంనగర్లో కుళ్లిన శవాలు... పోలీసుల విచారణ
karimnagar : కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో రెండు శవాలు కలకలం రేపాయి..కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాలు కనిపించడంతో స్థానికలు ఆందోళన చెందారు. అయితే అనారోగ్యభారంతో జీవీతంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న దంపతులుగా గుర్తించారు.
జీవితంపై విరక్తి చెందిన దంపతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా మృతదేహాలు కుళ్లిన స్థితిలో లభ్యమైన ఘటన సోమవారం సాయంత్రం బెజ్జంకి మండలం దేవక్కపల్లి రాజీవ్ రహదారి శివారులో చోటు చేసుకుంది . వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్కు చెందిన గుజ్జుల రాజిరెడ్డి ( 52 ) అరుణ ( 48 ) దంపతులు . రాజిరెడ్డి మొదటి భార్య చనిపోగా వారికి ఓ కుమారుడు , కూతురు సంతానం . తరువాత రాజిరెడ్డి అరుణను రెండో వివాహం చేసుకున్నారు . అప్పటి నుంచి మొదటి భార్య కుమారుడు , కూతురు వేరుగా ఉంటున్నారు . రెండో భార్యకు పిల్లలు లేకపోవడం , ఇద్దరూ తరచూ అనారోగ్యం బారిన పడుతుండటంతో పాటు రాజిరెడ్డి గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు .
ఆ గాయం పెద్దది కావడంతో పాటు , కుటుంబ సమస్యలతో వేదనకు గురై నాలుగు నెలల క్రితం ఇద్దరు ఇంటి నుంచి బయటికి వెళ్లారు . తిమ్మాపూర్ పోలీసు స్టేషన్లో మేము చచ్చిపోతున్నాం మాకోసం ఎవరూ వెతకొద్దు అంటూ ఫిర్యాదులో రాసి ఇచ్చారు . ఈ నేపథ్యంలో పక్షం రోజుల క్రితం దేవక్కపల్లి శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో వారు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు . మృతదేహాల వద్ద పురుగు మందు డబ్బాను ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సోమవారం సాయంత్రం ఘటనకు సమీపంలో పశువులను మేపేందుకు వచ్చిన రైతుకు దుర్వాసన రావడంతో చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. శవపరీక్ష అనంతరం అదృశ్యం కేసుల వివరాలు తెలుసుకొని అల్గునూర్కు చెందిన దంపతులుగా గుర్తించారు . మొదటి భార్య కుమారుడు అఖిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఎ తెలిపారు .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.